EPAPER
Kirrak Couples Episode 1

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

Telangana DSC results released by CM Revanth Reddy: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్  విడుదల చేశారు. అయితే ఈ సారి డీఎస్పీ మార్కులతో పాటు టెట్ మార్కులు కూడా ర్యాంకు జాబితాలో చేర్చారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే డీఎస్పీ ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.


అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. అయితే రిజల్ట్స్ చూసేందుకు https://tgdsc.aptonline.in/tgdsc/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఇక్కడ tgdsc అనే మెరిట్ లిస్ట్ లింక్ క్లిక్ చేయాలి. అనంతరం జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సర్టిఫికెషన్ వెరిఫికేషన్ కోసం నియామకమైన అభ్యర్థుల పేర్లు కనిపించనున్నాయి. ఇక, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్.. సర్టిఫికెషన్ వెరిఫికేషన్ పూర్తయి వెంటనే అందుబాటులోకి రానుంది.

అయితే కేవలం మార్కులు, ర్యాంకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఇక, మెరిట్ రోస్టర్ ప్రకారం.. సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా సంబంధిత జిల్లా విద్యాధికారులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం 1:3 నిష్పత్తిలో జిల్లాలవారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉండనుంది.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 వేల పోస్టులతో ఒకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. అలాగే భవనాలు లేకుండా ఎన్నో గురుకులాలను కొనసాగించిందన్నారు.

ఇదిలా ఉండగా, మొత్తం 11,056 టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. దీంతో పరీక్షలు ముగిసిన 56 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది డీఎస్సీ పరీక్షలను తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించింది.

Also Read: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఆగస్టు 13న విద్యాశాఖ ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు స్వీకరించింది. వెంటనే సెప్టెంబర్ 6న ఫైనల్ కీ విడుదల చేసింది. ఇక, 11,056 పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 ల్యాంగ్వేజ్ టీచర్స్, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, 22ం స్కూల్ అసిస్టెంట్స్, 796 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయనుంది.

Related News

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Big Stories

×