EPAPER

Kaikala: అప్పట్లో ఎస్వీఆర్.. ఆ తర్వాత కైకాలనే.. అయ్యారే…

Kaikala: అప్పట్లో ఎస్వీఆర్.. ఆ తర్వాత కైకాలనే.. అయ్యారే…

Kaikala: మాయాబజార్ చూసే ఉంటారుగా. వివాహ భోజనంబు.. సాంగ్ ను ఎవరూ మర్చిపోలేరుగా. అప్పట్లో ఎస్వీ రంగారావు అంటే ఇండస్ట్రీలో హడల్. గంభీరమైన పాత్రలు చేయాలంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎస్వీఆరే. ఏ పౌరాణిక పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. సాంఘీక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. నిత్యం రెండు, మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. చాలా ఏళ్ల పాటు వెండితెరపై ఎస్వీఆర్ కు ఆల్టర్నేట్ లేకుండే.


ఎస్వీ రంగారావు మరణానంతరం ఆయన మాత్రమే చేయగలే గంభీరమైన పాత్రలు కైకాల సత్యనారాయణకు వచ్చాయి. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాల్లో బలమైన పాత్రలు దక్కాయి. క్రమక్రమంగా ఎస్వీఆర్ నే మరిపించే స్థాయికి చేరుకున్నారు కైకాల. అది యముడైనా, ఘటోత్కచుడైనా.

‘స్వర్ణగౌరి’లో శివుడిగా.. ‘మదన కామరాజు కథ’లో ధర్మపాలుడిగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనునిగా నటించి మెప్పించారు. ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో దుర్యోదనుడిగా, ‘దాన వీర శూరకర్ణ’లో భీమునిగా, ‘సీతా కల్యాణం’లో రావణాసురుడిగా అసమాన నటన ప్రదర్శించారు.


ఆ రూపం ఓసారి గుర్తు చేసుకోండి. పెద్ద కళ్లు.. ఆ కళ్లతోనే నవరసాలు పలికించే నటనా కౌశలం. పైపైకి ఎగిసిపడే ఒత్తైన కనుబొమ్మలు. తలపై పెద్ద కిరీటం. మెడలో భారీ ఆభరణాలు. పంచెకట్టు. చేతిలో గధ లాంటి ఆయుధాలు. ఆ నిలువెత్తు రూపం చూడండి.. కైకాల సత్యనారాయణ రూపం మళ్లీ మీ మది నుంచి చెరిగిపోదంటే నమ్మండి.

కైకాలను కేవలం పౌరాణికాలకే పరిమితం చేయలేం. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున ఇలా ఆనాటి యువ హీరోలెందరితో కలిసి పని చేశారు. విలన్ గా అనేక మంది హీరోలకు చుక్కలు చూపించారు. ‘గూండా’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘సమర సింహారెడ్డి’ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అయితే మరో లెవెల్. తండ్రిగా, తాతగా, ఇంటి పెద్దగా.. ఇలా ఒక్కటేమిటి వెండితెర కుటుంబంగా, మనలో ఒకడిగా ఒదిగిపోయారు కైకాల సత్యనారాయణ. మురారీ మూవీలో.. పెద్ద ఏజ్ లో చిన్నపిల్లాడి మనస్తత్వంతో ఆయన చేసిన క్యారెక్టర్ అదుర్స్.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 60 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన ప్రముఖ నటుడు సత్యనారాయణ.. 87 ఏళ్ల వయసులో.. శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.

Tags

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×