EPAPER
Kirrak Couples Episode 1

RP Singh: RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదు !

RP Singh: RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదు !

RP Singh foresees RCB’s retention strategy ahead of IPL 2025 Auction:  విరాట్‌ కోహ్లీ లేకపోతే.. RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ ప్లేయర్‌ ఆర్పీసింగ్. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రేజీ టీం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం నిజంగా బాధాకరం. స్టార్ ప్లేయర్లకు అడ్డాగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ కప్ గెలవలేకపోయింది. జట్టులో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆట తీరు కనబరుస్తున్న ఇప్పటివరకు ఆర్సిబి ఛాంపియన్ గా నిలబడలేకపోయింది. అయితే ఈసారి జట్టు రూపురేఖలను మార్చేయాలని ఎక్స్పర్ట్ సూచనలు చేస్తున్నారు.


కొందరు మాజీలు కూడా అదే మాటను చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఆర్పి సింగ్ స్పందించడం జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కాస్త డిఫరెంట్గా ఆలోచనలు చేయాలన్నాడు. కొత్త మైండ్ సెట్ తో వేలానికి వెళ్లాలని సూచించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం విరాట్ కోహ్లీని మాత్రమే రిటైన్ చేసుకోవాలని కోరారు. 2008 నుంచి కోహ్లీ ఆర్సిబి జట్టుతోనే ఆడుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. స్టార్ బ్యాటర్ ను దృష్టిలో పెట్టుకుని జట్టును పూర్తి చేయాలన్నాడు. కోహ్లీని కనక రిటైన్ చేసుకుంటే 18 కోట్లు ఇవ్వాలి. తర్వాత ప్లేయర్ ను రిటైన్ చేసుకుంటే 14 కోట్లు, మూడవ ప్లేయర్ కు 11 కోట్లు ఇవ్వాలి.

RP Singh foresees RCB retention strategy ahead of IPL 2025 Auction

నాల్గవ ప్లేయర్ కు 18 కోట్లు, ఐదవ ప్లేయర్ కు 14 కోట్లు చెల్లించాలన్నాడు. అయితే 14 కోట్లు గాని 11 కోట్లుగాని చెల్లించి కొంతమందిని రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు ఆర్పి. వేలానికి కనక వదిలేస్తే సిరాజ్ 14 కోట్లు పలకకపోవచ్చు అని అన్నాడు. 11 కోట్ల వద్ద అవసరం అనుకుంటే ఆర్టీఎంను ఉపయోగించి రిటైన్ చేసుకోవచ్చన్నాడు. రజత్ పటిదార్ విషయంలోనూ ఆర్ పి సింగ్ అలానే స్పందించాడు. ఫ్రెష్ అప్రోచ్ తోనే ఈసారి వేలంలో వ్యూహాలను రచించాలన్నాడు. నిజానికి ఆర్సిబిలో కోహ్లీ కాకుండా ఎవరు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో డూప్లెసిస్ పరవాలేదనిపించాడు. కానీ అతని వయసు 40 సంవత్సరాలు. ఫిట్ గా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

దీంతో కెప్టెన్ డూప్లెసిస్ ను వదిలించుకునే ఆలోచనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉన్నట్లుగా తెలుస్తోంది. మ్యాక్స్వెల్ కూడా స్టార్ ఆటగాడే కాకపోతే మ్యాక్స్వెల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గత సీజన్లో తన బ్యాటింగ్ పేరుతో ఫెయిల్ అయ్యాడు. బాల్ తోను ఆకట్టుకోలేకపోయాడు. పైసా వసూల్ ఆటగాడిగా నిలవలేకపోయాడు. కెమెరాన్ గ్రీన్ కూడా నిలకడగా ఆడలేక పోతున్నాడు. దీంతో గ్రీన్ ను సైతం వదిలేసుకోవాలని అనుకుంటున్నారు. మహమ్మద్ సిరాజ్ విషయంలో ఆర్సిబి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది. యష్ దయాల్ ను రిటైన్ చేసుకుంటుందా లేదా వేలానికి పంపిస్తుందా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. మొత్తంగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.

Related News

IPL 2025: రోహిత్‌ సంచలన నిర్ణయం..అంబానీకి కోట్లల్లో నష్టం ?

IPL 2025: ధోని కోసం స్పెషల్‌ రూల్స్‌…చెన్నైకి లాభం ఉంటుందా ?

Warning To Pakistan Cricketers: ‘ఫిట్‌నెస్ లేకపోతే కాంట్రాక్ట్ రద్దు’.. పాకిస్తాన్ క్రికెటర్లకు పిసిబి గట్టి వార్నింగ్..

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

Big Stories

×