EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad realtor: ఈడీకి చిక్కిన హైదరాబాద్ రియల్టర్.. మూడు వేల కోట్లు వసూలు, ఆపై..

Hyderabad realtor: ఈడీకి చిక్కిన హైదరాబాద్ రియల్టర్.. మూడు వేల కోట్లు వసూలు, ఆపై..

Hyderabad realtor: ప్రీ లాంచ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడింది సాహితీ ఇన్‌ఫ్రా. నిర్మాణాలు చేస్తామని చెప్పి వినియోగ దారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. చివరకు ఆదివారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎండీ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు.


హైదరాబాద్‌లో సాహితి ఇన్ఫ్రా ఆగడాలు అన్నీ ఇన్నీకావు. సరిగ్గా రెండేళ్ల కిందట ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఫ్లాట్లను విక్రయించింది. అమీన్‌పూర్‌తోపాటు మిగతా ప్రాంతాల్లో సాహితీ శర్వాణీ ఎలైట్ పేరుతో శ్రీకారం చుట్టారు ఎండీ లక్ష్మీనారాయణ. రేటు తక్కువ పెట్టి, అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు చెప్పగానే వేలాది మంది కొనుగోలుదారులు ఎట్రాక్ట్ అయ్యారు.

కస్టమర్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా, పనులు ప్రారంభంకాలేదు. అమీన్‌పూర్ కాకుండా హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారాయన. దాదాపు రూ. 3 వేల కోట్లు వసూలు చేసి, చివరకు బోర్డు తిప్పేసింది సాహితీ ఇన్ఫ్రా.


సింపుల్‌గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పేరుతో బడా మోసం అన్నమాట. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బయటకు రావడం జరిగిపోయింది. ఇంతవరకు బాగానే జరిగింది. చివరకు సాహితీ ఇన్ప్రా గురించి ఈడీ ఫిర్యాదు వెళ్లింది. దీనిపై రెండురోజుల కిందట రంగంలోకి దిగిన ఈడీ, ఆదివారం రాత్రి సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీ నారాయణను అరెస్టు చేసింది.

ALSO READ: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

సాహితీ ప్రీ లాంచ్ వెనుక పెద్ద తలకాయలపై కూపీ లాగుతోంది. దీంతో తీగలాడితే డొంక కదులుతోంది. దీనివెనుక కొందరు రాజకీయ నేతలున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. మరి ఈడీ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

Hydra: సెలవు దినాల్లో ఎందుకు కూల్చుతున్నారు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

BRS: భయపెట్టు.. రెచ్చగొట్టు.. మూసీపై బీఆర్ఎస్ డబుల్ గేమ్? అప్పుడలా.. ఇప్పుడిలా..

Women Welfare: మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. వైద్యశాలల సంఖ్య పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్‌లో పడొద్దు

Big Stories

×