EPAPER
Kirrak Couples Episode 1

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh Kashmir: ‘పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కంటే ఎక్కువ అప్పు భారత్ ఇవ్వగలదు’.. కశ్మీర్‌లో రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh Kashmir| భారత దేశంతో స్నేహంగా ఉండి ఉంటే పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు కన్నా ఎక్కువ అప్పు లభించేదని.. పాకిస్తాన్ సాయం చేయడానికి భారత్ ముందు ఉండేదని బిజేపీ సీనియర్ నాయకుడు, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.


జమ్ము కశ్మీర్ లో అసెంబ్లీలో ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. బిజేపీ తరపున రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ లోని బందిపూర్ జిల్లా గుల్రేజ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో చేశారు. ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ” జమ్ము కశ్మీర్ లో జరగబోయే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, భారత దేశంలో ప్రజాస్వామ్య బల ప్రదర్శన అని అన్నారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పిన మాటలను గుర్తుకు చేస్తున్నాను.. ఇన్సానియత్ (మానవత్వం), జమూరియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (కశ్మీర్ వాదం) కలిసి పని చేస్తే.. కశ్మీర్ మళ్లీ భూతల స్వర్గంగా మారపోతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు అని ఆయన అన్నారు.

Also Read: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్!


కశ్మీర్ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లోనే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ప్యాకేజీని కేటాయించారని అన్నారు. ఈ ప్యాకేజీ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎంత పెద్దదంటే పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు వద్ద అడిగిన అప్పు కంటే పెద్దది. ఈ ఎన్నికలు చాలా ముఖ్యం ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవద్దు. ఇది భారతదేశం ప్రజాస్వామ్య బల ప్రదర్శన.

స్నేహితులు నచ్చకపోతే కొత్తవారితో స్నేహం చేయగలం కానీ పక్కింటి వారు నచ్చకపోయినా వారిని మార్చలేం అని వాజ్ పేయి గారు చెప్పేవారు. ఇండియాతో.. పొరుగుదేశం పాకిస్తాన్ మంచి సంబంధాలు కలిగి ఉంటే భారత్ ఎంత సాయం చేయడానికైనా వెనుకాడదని చెప్పారు. ఆర్థిక సంక్షోభంతో కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంక్ కంటే ఎక్కువ అప్పడు భారత దేశం నుంచి లభించేది అని వ్యాఖ్యానించారు. ” అని కశ్మీరీలను ఉత్తేజపరిచారు.

కశ్మీర్ లో ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం తరువాత దేశంలో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు పాకిస్తాన్ తో స్నేహంగా ఉండాలని ప్రయత్నించాయి. ఉగ్రవాదం బాట వదిలి మానవత్వం బాట పట్టాలని చెప్పాయి. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులను భారత దేశ సరిహద్దుల్లోకి పంపిస్తోంది. అయినా ఉగ్రవాదులను మేము సమర్థవంతంగా ఎదుర్కొంటుంన్నాం. అయితే ఈసారి వీలైతే సరిహద్దులు దాటి పాకిస్తాన్ భూభాగంలో వారిని అంతం చేస్తాం.

ఆర్టికల్ 370 తీసేయడంతో జమ్ము కశ్మీర్ లో అభివృద్ధి జరుగుతోందని.. కశ్మీర్ కు వచ్చే టూరిస్టుల భారీగా పెరిగిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలోని యువత విసరడం మానేసి కంప్యూటర్ల చేతబట్టుకుందని అన్నారు. త్వరలోనే కశ్మీర్ లో ఐఐఎం, ఐఐటి, జాతీయ స్థాయి కాలేజీలు నెలకొల్పుతామని హమీ ఇచ్చారు. కానీ ఇవ్వన్నీ జరగకుండా రాష్ట్రంలో రెండు రాజకీయ కుటుంబాలు అడ్డుపడతున్నాయని.. పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పై దాడి చేశారు. ఆ పార్టీలు ప్రజల కోసం ఏమీ చేయలేదని.. కేవలం తమ కుటుంబాల కోసం పనిచేస్తాయని విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే.. అవి తిరిగి ఆర్టికల్ 370 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయని.. అలాంటి పార్టీలకు అసలు ఓటు వేయొద్దని కోరారు.

Related News

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Big Stories

×