EPAPER
Kirrak Couples Episode 1

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

FNCC President: ఇటీవల ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌ (FNCC)‌కు ప్రెసిడెంట్‌గా ఉండాల్సిన వ్యక్తి ఎవరు అనే విషయంలో ఎన్నికలు జరిగాయి. తాజాగా ఆ ఎన్నికల ఫలితాలు కూడా బయటికొచ్చాయి. 795 ఓట్ల భారీ మెజారిటీతో టాలీవుడ్ సీనియర్ నిర్మాతకు ఎఫ్ఎన్‌సీసీ ప్రెసిడెంట్ స్థానం దక్కింది. ఆ నిర్మాత మరెవరో కాదు.. కేఎస్ రామారావు. ఇక వైస్ ప్రెసిడెంట్ మరొక సీనియర్ నిర్మాత అయిన ఎస్ ఎన్ రెడ్డి గెలిచారు. ఇక ఎఫ్ఎన్‌సీసీకి సేవలు అందించడం కోసం పలువురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఆయా పదవులు సాధించారు.


ఏకగ్రీవ ఎన్నికలు

ఎఫ్ఎన్‌సీసీ జనరల్ సెక్రెటరీగా తుమ్మల రంగారావు ఏకగ్రీవ ఎన్నికయితే.. జాయింట్ సెక్రటరీగా సదాశివ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఇక ఎఫ్ఎన్‌సీసీ ట్రెజరర్‌ పదవిని జె శైలజ సొంతం చేసుకున్నారు. కొందరు సభ్యులు ఎఫ్ఎన్‌సీసీలో పర్మినెంట్ మెంబర్స్‌గా ఎంపికయ్యారు. ఆ లిస్ట్‌లో కె భవాని, కృష్ణంరాజు (వేణు), ఏడిద సతీష్ (రాజా), సి హెచ్ వరప్రసాద్ రావు ఉన్నారు. ఇక ఎఫ్ఎన్‌సీసీలో పనిచేయడం కూడా ఫిల్మ్ నగర్ సొసైటీ నుండి కూడా పలువురు సభ్యులు ముందుకొచ్చారు. ఫిల్మ్ నగర్ సొసైటీ నుండి వచ్చిన అయిదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం విశేషం. వారు కూడా ఎఫ్ఎన్‌సీసీలో సేవలు అందించడానికి సిద్ధమయ్యారు.


Also Read: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

భారీ మెజారిటీ

ఖాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, కె మురళీ మోహన్ రావు, నవ కాంత్ (కెమెరామెన్), బాల్ రాజ్.. వీరంతా ఫిల్మ్ నగర్ సొసైటీ నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యి ఎఫ్ఎన్‌సీసీలో సేవలు అందించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికంటే ఎక్కువగా ఎఫ్ఎన్‌సీసీ మద్దతు నిర్మాత కేఎస్ రామారావుకే ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఏకంగా 795 ఓట్ల మెజారిటీతో గెలవడం మామూలు విషయం కాదని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అనేది ఇండస్ట్రీలోని సభ్యులు అందరినీ ఒక్కచోట చేరుస్తుంది. వారు జరుపుకునే ఈవెంట్స్‌కు వేదికగా నిలుస్తుంది.

ఎన్నో ఏళ్ల అనుభవం

1983 నుండే నిర్మాతగా అనుభవం ఉంది కాబట్టి ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ బాధ్యత సీనియర్ నిర్మాత అయిన కేఎస్ రామారావుకే దక్కాలని చాలామంది ఇండస్ట్రీ సభ్యులు అనుకున్నారు. అందుకే ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారు. నిర్మాతగా మాత్రమే కాకుండా ప్రజెంటర్‌గా కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేశారు కేఎస్ రామారావు. ఆయన చివరిగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాను నిర్మించారు. ఆ తర్వాత నిర్మాణ విషయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఇక ప్రజెంటర్‌గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కేఎస్ రామారావు చివరి చిత్రం. గత కొన్నాళ్లుగా పూర్తిగా ఎఫ్ఎన్‌సీసీ బాధ్యతలతోనే బిజీ అయిపోయారు రామారావు.

Related News

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Big Stories

×