EPAPER
Kirrak Couples Episode 1

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Hero Ram Charan: ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన మ్యూజియం అది. ఆ మ్యూజియంలో చోటు దక్కాలంటే అంత ఆషామాషీ కాదు. కానీ ఓ టాలీవుడ్ హీరో కి ఆ మ్యూజియంలో అరుదైన అవకాశం లభించింది. అంతేకాదు అతని పెంపుడు శునకంకు సైతం మ్యూజియంలో చోటు దక్కడంతో.. ఆ టాలీవుడ్ హీరో ఆనందం అంతా ఇంత కాదు. ఇంతకు ఈ మ్యూజియంలో చోటు దక్కిన హీరో ఎవరో తెలుసా… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.


రామ్ చరణ్ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే రామ్ చరణ్ తన ఇంట్లో ఓ పెంపుడు శునకం సైతం ఉంది. దాని పేరే రైమీ. చరణ్ విదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్ళిన సమయంలో కూడా రైమీ ఉండాల్సిందే. కానీ ఒకసారి చరణ్ ఒక్కరే విదేశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో.. చరణ్ సతీమణి ఉపాసన, రైమీ ఎయిర్ పోర్ట్ కి స్వాగతం పలికేందుకు వెళ్లారు. అప్పుడు రామ్ చరణ్ ను చూసిన రైమీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే రైమీ, రామ్ చరణ్ మధ్య గల అనుబంధాన్ని వీడియో తీసిన ఉపాసన ఆ వీడియోను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. ఆ వీడియో అప్పుడు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా మెగా కుటుంబంలో రైమీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ప్రముఖుల మైనపు విగ్రహాలతో పాటు.. వారి పెంపుడు శునకంకు సైతం చోటు దక్కడం విశేషం. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ గా టాలీవుడ్ లో హిట్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు రామ్ చరణ్ ప్రాణంగా పెంచుకుంటున్న అతడి పెంపుడు శునకం రైమీ మైనపు విగ్రహాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.


Also Read: Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నాగార్జున ఫిదా.. ఈసారి బిర్యానీ తినేదెవరు?

ఇప్పటికే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన ఫోటోషూట్ లో రామ్ చరణ్ తో పాటు, రైమీ సైతం పాల్గొంది. త్వరలోనే వీరి మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనుండగా.. తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపుపై రామ్ చరణ్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ ఫ్యామిలీలో తాను కూడా ఒక భాగం కావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా.. చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన డాన్సులతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి మెగాస్టార్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆనందంలో ఉన్న రాంచరణ్ కు.. ఈ మ్యూజియంలో చోటు దక్కడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది.

Related News

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Big Stories

×