EPAPER
Kirrak Couples Episode 1

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

IPL mega auction: ఐపిఎల్ మెగా ఆక్షన్ కోసం రంగం సిద్ధమవుతోంది. అయితే తమ పాత ప్లేయర్లను రిటెయిన్ చేసుకోవాలనుకునే ఫ్రాంచైజీలు నిర్ణీత గడువులోగా ప్లేయర్ల లిస్టు ప్రకటించాలని దేశంలోని క్రికెట్ బోర్డు.. ‘ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా’ (BCCI) తెలిపింది. అక్టోబర్ 31, 2024లోగా పాత ప్లేయర్లను రిటెయిన్ చేసుకునే ఫ్రాంచైజీలు లిస్టు ప్రకటించాలని డెడ్ లైన్ విధించింది.


నవంబర్ నెల చివర్లో ఐపిఎల్ మెగా ఆక్షన్ జరుగనుండగా.. ఐపిఎల్ లోని 10 ఫ్రాంచైజీలు ఇది వరకే తమ జట్టులో ఆడుతున్న ప్లేయర్లలో ఆరుమందిని దాకా రిటెన్షన్ పద్ధతి ద్వారా లేదా రైట్ టు మ్యాచ్ (ఆర్‌టిఎం) కార్డ్ ఆప్షన్ ద్వారా రిటెయిన్ చేసుకోవచ్చని బిసిసిఐ అనుమతులు ఇచ్చింది.

క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం… అంతర్జాతీయ క్రికెట్ లో అక్టోబర్ 31 లేదా అంతకంటే ముందే తన తొలి మ్యాచ్ ఆడబోయే ప్రేయర్ ని కూడా ఐపిఎల్ ఆక్షన్ లో కాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తామని బిసిసిఐ తన ప్రకటనలో పేర్కొంది. ఏ ప్లేయర్ ని రిటెయిన్ చేసుకోవాలో ఆ నిర్ణయాన్ని ఆర్‌టిఎం లేదా కాంబినేషన్ రిటెన్షన్ పద్దతి ద్వారా తెలియజేయాలి. అయితే క్యాప్డ్ ప్లేయర్లు అత్యధికంగా అయిదుగురిని, అన్ క్యాప్డ్ ప్లేయర్లని ఇద్దరిని మాత్రమే రిటెయిన్ చేసుకునేందుకు బిసిసిఐ అనుమతించింది.


Also Read: విమానంలో అందరిముందు శృంగారం.. ప్రేమికులకు శిక్ష విధించిన కోర్టు!

ఈసారి ఆక్షన్ లో ప్రతి టీమ్ కు పర్స్ లిమిట్ రూ.120 కోట్లకు పెంచింది. పైగా బిసిసిఐ సెక్రటరీ జే షా ప్రతి ప్లేయర్ కు రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజు లభింస్తుందని ప్రకటించడం విశేషం. అంటూ ఒక ప్లేయర్ ఐపిఎల్ సీజన్ లోని అన్ని మ్యాచ్ లు ఆడితే అతనికి రూ.1.05 కోట్లు మ్యాచ్ ఫీజు ద్వారా లభిస్తుంది. ఇది కాంట్రక్ట్ ద్వారా వచ్చే సంపాదనకు అదనం. మ్యాచ్ ఫీజు కోసం ప్రతి ఫ్రాంచైజీ రూ.12.6 కోట్లు కేటాయించాలని కూడా జే షా చేసిన సోషల్ మీడియా పోస్టు లో ఉండడం గమనార్హం.

అయితే బిసిసిఐ ప్రకటనలో ఆశ్చర్యకర విషమేమిటంటే ఇప్పటి వరకు అధికారికంగా ప్లేయర్ల రిటెన్షన్ కోసం స్లాబ్ రేట్స్ ప్రకటించలేదు. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. రిటెయిన్ చేసుకునే మొదటి ప్లేయర్ రూ.18 కోట్ల రేటు ఉండే అవకాశముంది. ఈ సారి బిసిసిఐ మరో పాత రూల్ తీసుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఇండియన్ ప్లేయర్ లేదా బిసిసిఐ తో గత 5 సంవత్సరాలలో ఎటువంటి కాంట్రాక్టు లేని ప్లేయర్లను అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు. ఈ రూల్ 2021లో తొలగించినా ఈసారి మళ్లీ తీసుకువచ్చారు.

ఈ రూల్‌ని చేర్చడంతో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్రాంచైజీ.. తిరిగి ఎంఎస్ ధోనీ ని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే అన్ని రిటెన్షన్లకు సంబంధించిన కార్యక్రమాలను అన్ని ఫ్రాంచైజీలు అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటల లోగా ముగించాలి.

Related News

IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Big Stories

×