EPAPER
Kirrak Couples Episode 1

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Mla Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాస గృహం వద్ద నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సైతం ఇటువంటి ఘటనలు రాజాసింగ్ ఇంటి వద్ద జరగగా.. ఎమ్మెల్యేకు పోలీసులు బందోబస్తును పెంచారు.


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిరంతరం ఏదో ఒక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. అలాగే హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంలో రాజాసింగ్ ఎప్పుడు ముందుంటారు. అటువంటి తరుణంలో రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు ఉందన్న అభిప్రాయంతో… బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం పోలిస్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఎమ్మెల్యే గృహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసుల వివరాల మేరకు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి పరిసరాల్లో నలుగురు అనుమానితులు సంచరిస్తున్నట్లు స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అయితే స్థానికులు వారి కదలికలను గమనించి వారి వివరాలు అడిగేందుకు ప్రయత్నించారు.. అంతలోనే ఇద్దరు అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం. వారిలో ఇద్దరిని పట్టుకొని సోదా నిర్వహించిన స్థానికులు షాక్ కు గురయ్యారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను గమనించగా.. రాజాసింగ్ ఫోటోలు, ఫోన్ లోనే గన్, బుల్లెట్లు కూడా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన మంగళహాట్ పోలీసులు అనుమానిత వ్యక్తులను విచారించి షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. గతంలో సైతం ఇదే తరహా ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ నిర్వహించగా.. పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెంచారు. ఇంతకు వీరెవరు… అసలు వీరి వెనుక ఉన్నదెవరు.. ఈ కుట్రకు సూత్రధారులు ఎవరు? అనే పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Also Read: PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

పారిపోయిన ఆ ఇద్దరి వివరాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ జరిగినట్లు సమాచారం అందుకున్న గోషామహల్ బీజేపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఎమ్మేల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ రెక్కీపై ఎమ్మేల్యే మాట్లాడుతూ.. రెక్కీ నిర్వహించిన వ్యక్తులు తన ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారన్నారు. గతంలో తన ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని కోరారు.

Related News

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Minister Sridhar Babu: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్

Airport Metro: ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

Danam Nagendar : ఆ ఎమ్మెల్యేల చేరికలు కాస్త లేట్ కావొచ్చు.. కానీ పక్కా, దానం సంచలన వ్యాఖ్యలు

Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

Big Stories

×