EPAPER
Kirrak Couples Episode 1

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

Police stopped BRS MLAs Harish rao, sabitha at Telangana Bhavan: మూసీ పరివాహక బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ బృందం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం హైదర్ షా కోటకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.


కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హైదర్ కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం చేరుకోవడంతో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు, సబిత ఇంద్రా రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి నేతల ఆధ్వర్యంలో బాధితుల పరామర్శకు బయలుదేరారు.

హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఉన్నారు. కాగా, ప్రభుత్వానికి మూసీ పరివాహక ప్రాంతాలతోపాటు స్థానికులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Also Read: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కాగా, హైదర్ షా కోట్‌లో బాధితుల ఇళ్లను పరిశీలించారు.

Related News

Airport Metro: ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

Danam Nagendar : ఆ ఎమ్మెల్యేల చేరికలు కాస్త లేట్ కావొచ్చు.. కానీ పక్కా, దానం సంచలన వ్యాఖ్యలు

Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

HYDRA Demolitions: హైడ్రాపై బీఆర్ఎస్ హైడ్రామా చేస్తుందా?

Big Stories

×