EPAPER
Kirrak Couples Episode 1

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృ వియోగం

Telangana Minister Uttam Kumar Reddy Lost His Father: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే స్వర్గస్తులయ్యారు.. ఆయన వృద్ధాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటలో కొద్దిరోజులగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. మరికాసేపట్లో ఆయన నివాసానికి భౌతికకాయం చేరుకోనుంది. పురుషోత్తమ్ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తెలియజేశారు. సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పురుషోత్తమ్ రెడ్డి ఉషారాణి దంపతులకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కుమారులు.

Also Read: టీపీసీసీకి కొత్త కమిటీలు వచ్చేస్తున్నాయోచ్… త్వరలోనే ప్రకటన


ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద కొడుకు కాగా రెండవ కుమారుడు గౌతం రెడ్డి, కుమార్తె ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలోనే పురుషోత్తం రెడ్డి పార్ధివ దేహాన్ని ఉంచారు. ఇక పురుషోత్తమ్ రెడ్డి తూనికల కొలతల శాఖలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మరణాంతరం ఆగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. నీటి పారుదల శాఖ మంత్రి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Related News

Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

HYDRA Demolitions: హైడ్రాపై బీఆర్ఎస్ హైడ్రామా చేస్తుందా?

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×