EPAPER
Kirrak Couples Episode 1

HYDRA Demolitions: హైడ్రాపై బీఆర్ఎస్ హైడ్రామా చేస్తుందా?

HYDRA Demolitions: హైడ్రాపై బీఆర్ఎస్ హైడ్రామా చేస్తుందా?

అంతా బాగానే ఉంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. నిరాశ్రయులకు, నిస్సహాయులకు అండగా ఉండటంలో తప్పు లేదు.. ఉండాలి కూడా.. తప్పు జరిగితే ప్రశ్నించాలి.. నిలదీయాలి. అవసరమైతే గళ్లా పట్టుకొని ఎదురించాలి. కానీ హైడ్రా విషయంలో ఏం జరుగుతుంది? FTL, బఫర్‌ జోన్లలో ఉన్న వాటినే కూలుస్తున్నారు. ఇప్పటి వరకు కూలిన కట్టడాలన్ని  FTLలో ఉన్నవే.. హైడ్రా ఎక్కడా తన పరిధిని దాటడం లేదు. కానీ బీఆర్ఎస్‌ నేతలు ఈ విషయాన్ని దాచి పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారంటూ బాధితులను రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకింత పెద్ద ఆరోపణ చేయాల్సి వస్తుందో మీరో చూడండి.

వీరంతా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు. చాలా మందికి అసలు నోటీసులే రాలేదు.. ఎలాంటి మార్కింగ్స్ చేయలేదు. మరికొందరు జస్ట్ అద్దెకున్నవారు మాత్రమే.. కానీ వీరందరిలో ఓ భయం ఉంది. ఎక్కడ తమ ఇల్లు కూలిపోతుందో ఏమో అని. కానీ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే కూల్చివేతలు చేపట్టం. బాధితులందరికి పునరావాసం చేసిన తర్వాతనే కూల్చివేతల జోలికి వెళ్తాం.. అసలు పునరావాసం కల్పించడానికి మార్కింగ్స్‌ చేస్తున్నాం. ఇందులో కూడా ముందు స్వచ్చంధంగా తరలివెళ్లే వారిని గుర్తిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిపై ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నారు.


Also Read:  టీపీసీసీకి కొత్త కమిటీలు వచ్చేస్తున్నాయోచ్… త్వరలోనే ప్రకటన

అధికారులు కూడా అర్ధమయ్యేలా చెబుతున్నారు అండగా ఉంటాం.. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్న పని కాదు. హైదరాబాద్‌లో వరదలను కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎవరికీ అన్యాయం జరగనివ్వం.. మూసీ బాధితులందరికి అన్యాయం జరగనివ్వం. ఇదంతా ప్రజల కోసమే చేస్తున్న పని.. ఇలా ఉన్నాయి వారీ వ్యాఖ్యలు.

కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం దీన్ని ఓ పొలిటికల్ ఎజెంట్ గానే  చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఓ అస్త్రంగా మలుచుకొని అధికార పక్షంపై ప్రయోగిస్తోంది. విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రతి పనిని ప్రశ్నిస్తోంది. కానీ ప్రభుత్వం చేస్తున్న కృషిని మాత్రం అస్సలు గుర్తించడం లేదు. ఇప్పటికైనా ఈ తీరు మార్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే ఏ పని కూడా ఓవర్‌ నైట్‌లో కాదు.. కాస్త కష్టనష్టాల ఉంటాయి. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్‌కు ఇవి తెలియని విషయాలు కావు. కానీ వాళ్లు చెప్పరు.. చెబితే రాజకీయ నేతలందుకు అవుతారు మరి.

Related News

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Minister Sridhar Babu: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్

Airport Metro: ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

Danam Nagendar : ఆ ఎమ్మెల్యేల చేరికలు కాస్త లేట్ కావొచ్చు.. కానీ పక్కా, దానం సంచలన వ్యాఖ్యలు

Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Telangana Bhavan: తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్ రావు, సబితలను అడ్డుకున్న పోలీసులు

Big Stories

×