EPAPER
Kirrak Couples Episode 1

Anushka: అతనితోనే అనుష్క పెళ్లి.. ప్రభాస్ పరిస్థితి ఏంటి.. ?

Anushka: అతనితోనే అనుష్క పెళ్లి.. ప్రభాస్ పరిస్థితి ఏంటి.. ?

Anushka: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే హీరోల్లో ప్రభాస్ వస్తే.. హీరోయిన్స్ లో అనుష్క పేరునే వినిపిస్తుంది. యోగా టీచర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది సూపర్ సినిమాతో  ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక అరుంధతి సినిమాతో అనుష్క జీవితం మొత్తం మారిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అనుష్కకు గోపీచంద్ తో పెళ్లి ఫిక్స్ అయ్యినట్లు వార్తలు వచ్చాయి.


ఇక ఆ రూమర్స్ నుంచి బయటకు వచ్చాకా.. ఎప్పుడైతే బాహుబలి మొదలయ్యిందో.. అప్పటినుంచి ప్రభాస్ – అనుష్క  మధ్య ఏదో నడుస్తుందని  పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. బిల్లాలో ఈ ఇద్దరు నటించినా కూడా బాహుబలి 2, మిర్చి తరువాత వీరి ప్రేమ పుకార్లు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే తామిద్దరం మాత్రం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఇద్దరు చెప్తూనే వస్తున్నారు. కానీ, ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ మాత్రం.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుందని, ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అనుష్కనే అని మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఇక అనుష్క పెళ్లి రూమర్స్ వచ్చిన ప్రతిసారి ప్రభాస్ తోనే ఆమె పెళ్లి అని ఫ్యాన్స్ ఫిక్స్ చేసేస్తున్నారు. అంతేనా AI ద్వారా వీరిద్దరికీ పెళ్లి చేసి , పిల్లలను కూడా పుట్టించేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత కొన్ని నెలలుగా అనుష్క ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి సెట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. స్వీటీ కుటుంబానికి మొత్తం ఆ వ్యాపారవేత్త నచ్చాడని, స్వీటీ కూడా పెళ్ళికి రెడీ అవుతుందని టాక్ నడిచింది.


ఇక ఈ పెళ్లి వార్తలను అనుష్క కొట్టిపాడేసింది. దీంతో అప్పటి నుంచి ఆమె పెళ్లి రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది ఇక ఇప్పుడు  ఎప్పటినుంచో వస్తున్న వార్తలు.. మళ్ళీ రేగాయి. మరోసారి స్వీటీ పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అదే వ్యాపారవేత్తతో స్వీటీ పెళ్లి గురించి కుటుంబ సభ్యులు మాట్లాడారని తెలుస్తోంది. కానీ, అనుష్క మాత్రం ఇంకా పెళ్ళికి రెడీ గా లేను అని చెప్పిందంట. వయస్సు అయిపోతుందని స్వీటీ ఫ్యామిలీ ఆమెపై ఒత్తిడి తెచ్చిందని,  కొద్దిరోజులు అనుష్క టైమ్ అడిగిందని అంటున్నారు. ఈ కొద్దిరోజుల్లో ఆమె చెప్పే ఆన్సర్ కోసం రెండు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని టాక్.

ఒకవేళ అనుష్క ఒప్పుకుంటే.. ఈ ఏడాది చివరిలోగా అమ్మడి పెళ్లి భాజాలు మోగుతాయి అని చెప్పొచ్చు. అయితే స్వీటీ వేరే వ్యక్తిని పెళ్లాడితే.. ప్రభాస్, అనుష్క మ్యూచువల్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. ? అనేది ప్రశ్నగా మిగిలింది. అనుష్క, ప్రభాస్ ను కాకుండా వేరొకరిని పెళ్లాడితే ఫ్యాన్స్ ఏం చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. ఇక అనుష్క కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ఆమె ఘాటీ  అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.. ఇది కాకుండా కన్నడ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో అనుష్క ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Aishwarya Rai: బాలకృష్ణ కాళ్లకు ఐశ్వర్య రాయ్ సమస్కారం.. సౌత్, నార్త్ కాంట్రవర్సీకి బ్రేక్ పడినట్టేనా!

Karthi: తిరుపతి లడ్డూ వివాదం.. కార్తీ క్షమాపణ అంతా స్ట్రాటజీనా..?

Sathya Dev: సైడ్ అయ్యాడా? లేక వదిలేశారా..?

Jagapathi Babu: నీకు నాకు కొవ్వు ఎక్కువ.. మంచు వారసురాలిని పట్టుకొని అంత మాట అనేశాడు ఏంటి.. ?

Puri Jagannadh: ఇంటికొచ్చిన ఫ్యాన్స్ తో ముంబాయి నుంచి వీడియో కాల్ మాట్లాడిన పూరి జగన్నాథ్

Game Changer: బాబోయ్ రామ్ చరణ్ శంకర్ సాంగ్ ఇలా ఉంది ఏంటి ?

Big Stories

×