EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss Telugu 8 : అరె ఏంట్రా ఈ కన్ఫ్యుజన్.. వైల్డ్ కార్డు ఎంట్రీ లేనట్టేనా?

Bigg Boss Telugu 8 : అరె ఏంట్రా ఈ కన్ఫ్యుజన్.. వైల్డ్ కార్డు ఎంట్రీ లేనట్టేనా?

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్.. బిగ్ బాస్ ఈ పేరు ప్రస్తుతం జనాల్లో వినిపిస్తుంది. మూడు వారాలు పూర్తి చేసుకున్న తెలుగు సీజన్ 8 లో ముగ్గురు ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ వాడి వేడిగా సాగాయి. ఈరోజు, రేపు వీకెండ్ కావడంతో నాగార్జున వచ్చి సందడి చేస్తారు. ఇక కంటెస్టెంట్స్ తప్పులను ఒక్కొక్కరిని లేపి కడిగిపడేస్తారు. అందుకే జనాలు వారంతరం ఎపిసోడ్ వెయిట్ చేస్తారు. ఇక గత రెండు వారాలుగా వైల్డ్ ఎంట్రీ ద్వారా కొందరు వస్తారని చెబుతున్నారు బిగ్ బాస్.. ఇప్పటికి కూడా ఒక్కరిని కూడా హౌస్ లోకి తీసుకురాలేదు. అయితే పాత కంటెస్టెంట్స్ వస్తారని ఒకవైపు.. కొత్తగా ఓ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.. టాప్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది. 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ముగ్గురు ఎలిమినేట్ అయ్యిన విషయం తెలిసిందే. 11 మంది ఇంటి సభ్యులు మిగిలారు. వీరిలో నుంచి ఈరోజు ఫైర్ బ్రాండ్ సోనియా ఎలిమినెట్ అవుతుందనే వార్తలు ఇప్పటికే నెట్టింట ప్రచారంలో ఉన్నారు. అయితే ఇక ఆమె వెళ్తుందా లేదా ఎవరైనా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఇక ప్రస్తుతం హౌస్ లో వింత టాస్క్ లతో ఆడియన్స్ కు పిచ్చెక్కిస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు రోజులుగా టాస్క్ లలో కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

హౌస్ లోకి కొత్త వ్యక్తి ఎంట్రీ..


బిగ్ బాస్ హౌస్ లోకి నాలుగు వారాల తర్వాత మరో కంటెస్టెంట్ హౌస్ లోకి రావడం కామన్.. ఈసారి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు కంటెస్టెంట్ గా రాబోతున్నారని సమాచారం. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న గౌతమ్ కృష్ణ ఈ సీజన్ 8లో మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇక వైల్డ్ కార్డు ద్వారా నాలుగు పాత కంటెస్టెంట్స్ ఈ వారం లేదా వచ్చే వారం ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక హరితేజ, ఇనయా సుల్తానా, రోహిణి, ముక్కు అవినాస్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మరి వైల్డ్ కార్డు లేకుండా కూడా షోను నడిపిస్తాడేమో చూడాలి.. ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. విష్ణు ప్రియా, సోనియా డేంజర్ జోన్లో ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి చూస్తే తెలుస్తుంది.. అందులో సోనియా హౌస్ లోంచి బయటకు వెళ్లనుందని లీక్ అయ్యింది. చూద్దాం బిగ్ బాస్ రేపటికి ఏదైన ట్విస్ట్ ఇస్తారేమో..

Related News

Bigg Boss 8 Day 27 Promo 3: వారు ముగ్గురే టార్గెట్.. ఇచ్చిపడేసిన నాగ్..!

Big TV Exclusive: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 8 Day 27 promo 1: హీరో – జీరో.. ఏ మిస్ అంటూ పరువు తీసిన నాగ్..!

Bigg Boss 8 Telugu Promo: నిఖిల్, సోనియా వ్యవహారంపై నాగ్ రియాక్షన్.. వాళ్లను నమ్ముకొని వెనకబడిన చీఫ్

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె?

Bigg Boss: నబీల్ ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Big Stories

×