apple product offers : పండగ సీజన్ వేళ ప్రముఖ ఇ- కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ పేరిట ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్ పై అదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్ ప్రియులకు ఐఫోన్స్ పై సూపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు స్వయంగా యాపిల్ తన సొంత ఫెస్టివల్ సీజన్ ఆఫర్ సేల్ ను ప్రారంభించనుంది. పండగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యాపిల్ ప్రత్యేక సేల్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. యాపిల్ ఫ్యాన్స్, ఇతర వినియోగదారులను మరింత ఆకర్షించడమే లక్ష్యంగా, వారికి తక్కువ ధరకే ఐఫోన్ ను అందించేలా ఈ ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది యాపిల్ కంపెనీ.
ఈ యాపిల్ ఫెస్టివ్ సీజన్ సేల్ లో ఐఫోన్, మ్యాక్ బుక్ సహా పలు ఉత్పత్తులను రాయితీ ధరకు అందించనుంది. ఈ విషయాన్ని టెక్ వర్గాలే స్వయంగా వెల్లడించాయి. అయితే గరిష్ఠంగా ఎన్ని వేల వరకు తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయో మాత్రం ప్రస్తుతానికి తెలుపలేదు. ఇంకా ఈ సేల్ లో అదనంగా ఎక్స్ఛేంజ్ రాయితీలనూ పొందొచ్చు.
ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే? – ఇండియాలో వచ్చే నెల నుంచి ఈ యాపిల్ ఫెస్టివల్ ఆఫర్ మొదలు కానుంది. ఈ స్పెషల్ సేల్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్పెషల్ డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు యాపిల్ ఇండియా ఆన్లైన్లో స్టోర్‌లో ఉంటాయి.
ఏఏ ప్రొడక్ట్స్‌పై ఆఫర్లున్నాయంటే? – ఈ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 16 తో పాటు మ్యాక్ బుక్స్‌పై సూపర్ ఆఫర్స్‌ను ఇవ్వనుంది యాపిల్. అయితే ప్రస్తుతానికి ఆఫర్ల వివరాలను పక్కాగా ప్రకటించలేదు సదరు సంస్థ. కానీ త్వరలోనే ప్రకటించబోయే ఆ ఆఫర్ల ద్వారా ఉండే సదుపాయాలను తెలిపింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా, డిస్కౌంట్ల ద్వారా వీటిని పొందవచ్చు.
ALSO READ : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!
ఈ స్పెషల్ సేల్ ద్వారా కలిగే ప్రయోజనాలు – 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయంతో ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వారిగా పేమెంట్ చేయొచ్చు.
ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని యాపిల్ ట్రేడ్ ఇన్‌లో ఎక్స్చేంజ్ ద్వారా అడిషనల్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. అలానే ఇన్స్టంట్ క్రెడిట్‌ను పొందవచ్చు.
స్పెషల్ సేల్ తో మూడు నెలల వరకు యాపిల్ ఫ్రీ మ్యూజిక్‌ను పొందవచ్చు. అయితే సెలక్టడ్ యాపిల్ డివైస్‌ను కొనుగోలు చేస్తేనే ఇది వర్తిస్తుంది. మిగిలిన వాటికి వర్తించదు.
అలానే ఎయిర్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్, యాపిల్ పెన్సిల్ (2వ జనరేషన్), ఐప్యాడ్‌పై ఎమోజీస్, పేర్లు, నెంబర్లను ఫ్రీగా ఎంగ్రేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఒకవేళ మీరు యాపిల్ ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించే వరకు వేచి ఉండలేకపోతే.. ప్రస్తుతం ఆన్లైన్లో ఐఫోన్ 15, మ్యాక్ బుక్ ఎయిర్ ఎమ్1, ఎమ్ 2 మోడల్స్ పై బ్యాంక్ ఆఫర్స్ తో స్పెషల్ ప్రైస్ తో కొనుగోలు చేయవచ్చు.