EPAPER
Kirrak Couples Episode 1

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Jagan: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సాంగ్.. వైసీపీ అధినేత జగన్‌కు అతికినట్టు సరిపోతోంది. లడ్డూ వివాదం నుంచి ఇమేజ్ పొందాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా వేసిన స్కెచ్ విఫలమైంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


వైసీపీ అధినేత జగన్ శనివారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బెంగుళూరుకి వెళ్లారు. గడిచిన మూడునెలల్లో ఆయన బెంగుళూరు వెళ్లడం ఇది 12వ సారి. ప్రతీ శుక్రవారం విజయవాడ నుంచి బెంగుళూరుకి వెళ్లేవారు. తిరిగి మంగళవారం తాడేపల్లికి చేరుకునేవారు.

ఈసారి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుని బెంగుళూరు వెళ్లాలని ప్లాన్ చేశారు జగన్. కాకపోతే డిక్లరేషన్ అంటూ హిందూ సంఘాలతోపాటు చంద్రబాబు సర్కార్ డిమాండ్ చేయడంతో అక్కడికి వెళ్లి ఇబ్బందులుపడే బదులు సైలెంట్‌గా ఉండడంతో ఉత్తమమని నిర్ణయించుకున్నారాయన. శుక్రవారం తాడేపల్లిలో ఉండి శనివారం బెంగుళూరుకి వెళ్లారు. ఈసారి జగన్ ప్లాన్ ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.


అప్‌కోర్స్.. రాజకీయాలన్నాక ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. కాకపోతే జగన్ మైక్ ముందుకొచ్చిన ప్రతీసారి మీడియాకు మసాలా ఇచ్చేస్తున్నారు. దాంతో సోషల్‌మీడియాలో ఆయనను ఉతికి ఆరేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల కన్నా యాక్టివ్‌గా ఉండే గ్రూపులు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలంతా సైలెంట్ ఉండిపోయారు. కొంతమంది మాత్రమే మైక్ ముందుకు వస్తున్నారు.

ALSO READ: మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు నేతలు మీడియాతో నేతలు మాట్లాడిన 24 గంటల్లోపు ప్రత్యర్థి పార్టీలు రియాక్ట్ అయ్యేవి. ఇప్పుడు వెంట వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్ ముగుసు తొలగిపోయిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తప్పకుండా జగన్ తిరుమల వెళ్తారని, డిక్లరేషన్‌పై సంతకం పెడతారని అన్నారు. సీఎం చంద్రబాబు కుట్రతో ఆయన వెంకన్న దగ్గరకు వెళ్లలేదన్నారు.

ద్వారంపూడి వ్యాఖ్యలు చూస్తుంటే.. హిందూ వర్గాలు జగన్‌పై గుర్రగా ఉన్నారన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. పార్టీ డ్యామేజ్ కంట్రోల్ అవ్వకుండా ఉండడానికైనా జగన్ కచ్చితంగా తిరుమల వెళ్లి తీరాల్సిందే. దానికి ముహూర్తం ఎప్పుడన్నది వెయిట్ అండ్ సీ.

Related News

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

YS Sharmila: కూటమి సర్కార్‌ని ప్రశ్నిస్తూ.. జగనన్నపై షర్మిల బాణాలు

Roja: పవన్‌కు ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రోజా, మదురైలో పూజలు

AP Govt: సలహా ఇవ్వండి.. సర్టిఫికెట్ తీసుకోండి.. ఏపీ సీఎం ఐడియా అదిరింది కదూ..

Big Stories

×