EPAPER
Kirrak Couples Episode 1

17 years of chirutha: అవమానాల నుండి గ్లోబల్ స్థాయి ఇమేజ్.. చిరుత మూవీ విశేషాలు ఇవే.!

17 years of chirutha: అవమానాల నుండి గ్లోబల్ స్థాయి ఇమేజ్.. చిరుత మూవీ విశేషాలు ఇవే.!

17 years of Chirutha.. చిరుత (Chirutha) .. గ్లోబల్ స్టార్ ని తెలుగు తెరకు అందించడానికి పడిన తొలిమెట్టు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా పూరీ జగన్నాథ్ (Puri Jagannaath) దర్శకత్వంలో తొలి సారీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు రామ్ చరణ్ (Ram Charan) . మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు యాక్టింగ్ రాదని , మెగాస్టార్ కొడుకు కాబట్టే మొదటి సినిమా సక్సెస్ అయ్యింది అంటూ, అసలు ఇతడు హీరోనా అంటూ చాలామంది హేళన చేస్తూ కామెంట్లు కూడా అప్పట్లో చేశారని సమాచారం. అయితే వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రామ్ చరణ్ , తన తదుపరి చిత్రంతోనే ఏకంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసి మెగాస్టార్ తనయుడిగా పేరు సొంతం చేసుకున్నారు.


ఒక్క మూవీతో ట్రోలర్స్ నోరు మూయించిన చెర్రీ..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన మగధీర సినిమా ఓవర్ నైట్ లోనే రామ్ చరణ్ కు మంచి ఇమేజ్ అందించింది. అసలు నటనే రాదు అంటూ హేళన చేసిన వారికి పై దెబ్బగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. అంతేకాదు అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసింది. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు రామ్ చరణ్. మరి అవమానాలు అందుకొనే స్థాయి నుండి గ్లోబల్ స్థాయి ఇమేజ్ వరకు ఆయన పడిన కష్టం వర్ణనాతీతం.


చిరుత మూవీ విశేషాలు..

ఇకపోతే నేటితో రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు.. మరి తన సినీ కెరియర్ కి బీజం పోసిన చిరుత సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నేహా శర్మ హీరోయిన్ గా, రామ్ చరణ్ హీరోగా.. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, తనికెళ్ల భరణి , బ్రహ్మానందం, డేనియల్ బాలాజీ, సాయాజీ షిండే,అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చరణ్ అనే యువకుడు తన తల్లిదండ్రులను చంపిన క్రైమ్ బాస్ మట్టు పై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనే కథాంశం తో సాగుతుంది. ఈ సినిమాకి గాను చరణ్ కి ఉత్తమ డెబ్యూ మేల్ క్యాటగిరిలో సౌత్ ఫిలింఫేర్ అవార్డు లభించగా, తొలి చిత్రంతో ఉత్తమ నటనకి గానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాని బెంగాలీలో రంగ్ బాజ్ గా కూడా రీమేక్ చేశారు.

చిరుత కలెక్షన్స్..

ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.25.19 కోట్ల షేర్ రాబట్టింది . మొత్తంగా ఈ సినిమా కొన్న బయ్యర్స్ కి ఏకంగా రూ.7.19 కోట్ల లాభాలను మిగిల్చింది.

Related News

Manmadha: 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడంటే..?

Devara Collections: ‘కల్కి’ రికార్డ్ బ్రేక్.. ప్రభాస్ కంటే బెస్ట్ హీరో అని చెప్పడానికి ఈ లెక్క చాలదా.?

Pawan Kalyan Vs Prakash Raj: జస్ట్ ఆస్కింగ్.. ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్?

IIFA 2024 : ఒకే ఫ్రేంలో చిరు, బాలయ్య, వెంకీ… ఐఫా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

Rajiniknath: తిరుపతి లడ్డూ వివాదం.. నన్ను క్షమించండి అన్న రజనీకాంత్

Devara: నాన్ SSR రికార్డ్స్ బ్రేక్.. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఆ స్థానం..!

Ranbir Kapoor : కొత్త బిజినెస్ మొదలెట్టిన రణబీర్ కపూర్… బర్త్ డే స్పెషల్ గా బట్టల వ్యాపారం

Big Stories

×