EPAPER
Kirrak Couples Episode 1

Devara USA Collections : అమెరికా గడ్డ మీద దేవర సేఫ్… ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

Devara USA Collections : అమెరికా గడ్డ మీద దేవర సేఫ్… ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

Devara USA Collections.. దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) రెట్టింపు వేగంతో దేవర (Devara )సినిమా చేశారు. కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది అంతేకాదు ఇందులోని కొన్ని ప్రశ్నలు సీక్వెల్ పై క్యూరియాసిటీని పెంచేసాయనే చెప్పాలి. మొదటి భాగం చూసిన వారంతా రెండో భాగం ఎప్పుడు షూటింగ్ మొదలుపెడతారు..? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే కొరటాల మ్యాజిక్ ఇక్కడ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు.


మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్స్..

ఇదిలా ఉండగా రూ.350 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఎన్టీఆర్.. మొదటి రోజే గట్టి కలెక్షన్స్ వసూలు చేశారని తెలుస్తోంది. మొదటి రోజే అంచనాలు భారీగా పెరగడంతో రూ .125 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను దాటేస్తూ ఏకంగా రూ.177.70 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే తొలిరోజే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది . ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లను నమోదు చేసుకున్న ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో రూ .70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుందని సమాచారం. అయితే నార్త్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కేవలం రూ.7 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా బిజినెస్ జరగగా.. దేవర సేఫ్ జోన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.


యూఎస్ఏ గడ్డపై దేవర బ్రేక్ ఈవెన్..

ఇకపోతే ఈ సినిమా ఇండియాలోనే కాదు విదేశీ గడ్డపై కూడా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇండియాలో విడుదల కాకముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డ విషయం తెలిసిందే. ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ కూడా ఈ సినిమాపై రకరకాల కామెంట్లు వ్యక్తం చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దేవర యూఎస్ఏ గడ్డపై ప్రభంజనం సృష్టిస్తోంది మొదటి రోజే ఏకంగా 4 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.33 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది..అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే తోనే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ సినిమా. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ పై భారీగా పడిందనే చెప్పాలి. మొత్తానికైతే కొరటాల శివ మ్యాజిక్ బాగా వర్క్ ఔట్ అయ్యింది. దీనికి తోడు ఈరోజు, రేపు వీకెండ్స్ కావడంతో ఈ విలువ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఏదేమైనా ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అయ్యారు.

Related News

Jani Master Case : ‘జానీ నాకు అన్నయ్య’.. బాధిత యువతి మాటలివి… కేసులో అసలు ట్విస్ట్ ఇదే..

Devara Collections Day 1 : బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ… రికార్డులు అన్నీ మాయం..

Dil Raju : వెటరన్ డైరెక్టర్ తో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్… వారసుడి కోసం రిస్క్

HBD Puri Jagannadh: పూరీ చిరకాల కోరిక మెగాస్టార్ తీర్చేనా..?

17 years of chirutha: అవమానాల నుండి గ్లోబల్ స్థాయి ఇమేజ్.. చిరుత మూవీ విశేషాలు ఇవే.!

Devara: సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటించిందెవరంటే..?

Big Stories

×