EPAPER
Kirrak Couples Episode 1

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Netanyahu At UN| ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం చేస్తూ.. ఇరాన్ కు పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దేశంలో ఏమూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదని.. ఇజ్రాయెల్ కబంద హస్తాల నుంచి ఇరాన్ నియంతలు తప్పించుకోలేరని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశాల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతం రాజకీయాలు, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో కాల్పుల విరమణ అంశంపై ఆయన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌ను టార్గెట్ చేస్తూ.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో 1500 మంది చనిపోయారని సమాచారం. సంవత్సర కాలంగా జరుగుతున్న గాజా యుద్ధంలో 21 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చాలని ఫ్రాన్స్, అమెరికా ప్రయత్నాలను ఇజ్రాయెల్ ఏ మాత్రం పట్టించుకోకుండా లెబనాన్ పై వరుసగా మిస్సైల్స్ ప్రయోగిస్తూనే ఉంది.

Also Read:  సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!


ఈ నేపథ్యంలో నెతన్యాహు ఐరాస భద్రతా మండలిలో ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన హెజ్బుల్లాని ఇజ్రాయెల్ శత్రువుగా అభివర్ణించగా.. ప్రపంచ దేశాల చాలామంది ప్రతినిధులు ఆయన ప్రసంగం చేస్తుండగా వాక్ అవుట్ చేశారు. మరి కొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌ని సమర్థిస్తూ చప్పట్లు కొట్టారు.

”హెజ్బుల్లా యుద్ధం కోరుకున్నంత సేపు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది. మాకు మరో ప్రత్యామ్నాయం లేదు. హెజ్బుల్లా లాంటి ప్రమాదాన్ని అంతం చేసి హమాస్ చేతిలో బందీలుగా ఉన్న మా పౌరులను సురక్షితంగా ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం. ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. మా లక్ష్యం నెరవేరే వరకు హెజ్బుల్లాపై దాడులు చేస్తూనే ఉంటాం.

ఇరాన్ కు కూడా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ దేశ నియంతలు ఏ మూలలో దాక్కున్నా ఇజ్రాయెల్ వారిపై దాడి చేయగలదు. మీరు మాపై దాడులు చేస్తే.. మేము తిరిగి మరింత తీవ్రంగా దాడి చేస్తాము. మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కడైనా సరే శత్రువులపై ఇజ్రాయెల్ దాడి చేయగలదు. ఇది వాళ్లు గుర్తుపెట్టుకోవాలి” అని తీవ్ర స్వరంతో నెతన్యాహు ప్రసంగించారు.

Also Read: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

గురువారం సెప్టెంబర్ 26, 2024న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయానికి గాజా యుద్ధం విరమించాలని శాంతిని నెలకొల్పాలని అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రస్తావన పంపించాయి. ఇంతవరకు నెతన్యాహు ఆ ప్రస్తావనపై స్పందించలేదు. తాజాగా ఐరాసలో నెతన్యాహు ప్రసంగం తరువాత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లెబనాన్ లో మారణహోమం
గత సంవత్సరం ఆక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిగిన తరువాత హెజ్బుల్లా కూడా మరోవైపు నుంచి ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తూనే ఉంది. కానీ వారం రోజులుగా ఇజ్రాయెల్ నేరుగా లెబనాన్ లో సైనిక స్థావరాలతో పాటు పౌరుల నివాసాలపై కూడా రాకెట్ దాడులు చేస్తోంది.

ఇప్పటివరకు ఈ దాడుల్లో కేవలం ఉత్తర లెబనాన్ లో 700 మంది లెబనాన్ పౌరులు చనిపోగా 1,18,000 మంది దేశం వదిలి వెళ్లిపోయారు. యుద్దం మొదలైనప్పటి నుంచి 1500 మందికి పైగా మరణించారు. ఇంతకుముందు 2006లో హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో 1200 మంది లెబనాన్ వాసులు మృతిచెందగా.. 160 మంది ఇజ్రాయెల్ వాసులు ఎక్కువగా సైనికులు చనిపోయారు.

Related News

Iranian Hackers Target Trump Campaign: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Big Stories

×