EPAPER
Kirrak Couples Episode 1

Rajamouli – Mahesh Babu : ఏంటి..రాజమౌళి – మహేష్ బాబు మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లా?

Rajamouli – Mahesh Babu : ఏంటి..రాజమౌళి – మహేష్ బాబు మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లా?

Rajamouli – Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రత్యేకమైన కథతో రావడంతో పాటుగా భారీ బడ్జెట్ తో ఉంటాయి. త్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో సీనినాను జక్కన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్లు అంటూ ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక మహేష్ న్యూ లుక్ ఏ సినిమా కోసమో అని ప్రిన్స్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అది నిజమే ఆ లుక్ రాజమౌళి సినిమా కోసమేనట.. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చాలా వర్క్ సైలెంట్‌గా చాలా స్పీడ్‌గా జరుగుతూనే ఉంది.. ఫటా ఫట్ ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


జక్కన్న మూవీ థియేటర్లలో లోకి రావడానికి కనీసం రెండు, మూడేళ్లు టైం పడుతుంది. 2027లో రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీ స్టోరీ బోర్డ్ కంప్లీట్ అయ్యింది…వెయ్యికోట్లతో ఈ మూవీ తెరకెక్కబోతుంది.. వెయ్యి కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇండియాలో ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న తొలి చిత్రం ఇదే..ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేసేది కేఎల్ నారాయణ..ఆయనతో పాటు మరో ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్‌ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్‌ చేయనుంది.. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్‌తో చాలా ప్రముఖ ప్రొడక్షన్స్‌ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి..ముఖ్యంగా డిస్నీ పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది..ఇదే నిజమైతే ఇది మాములు విషయం కాదు.. తెలుగువాడి సత్తా అంతర్జాతీయంగా ప్రూవ్ అయినట్టే..

ఇక జంగిల్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతుంది..అన్ని మతాలను ఈ మూవీలో ఇన్‌క్లూడ్ చేయబోతున్నారు రాజమౌళి.. ఈ మూవీ షూట్‌ ఇండియాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో జరగనుంది.. ఇప్పటికే గ్రాఫీక్స్‌ వర్క్‌ స్టార్టయ్యింది కూడా..
న్యూజిలాండ్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం కూడా అయిపోయింది.. అండ్ వర్క్‌ కూడా వాళ్లు ప్రారంభించారు.. గ్రాఫీక్స్ అండ్ VFX కోసమే వంద కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.. రాజమౌళి అన్ని మూవీస్‌ లాగానే ఈ మూవీకి కూడా విజయేంద్రప్రసాద్ స్టోరిని అందించబోతున్నారు.. ఇక ఎప్పటిలాగానే ఆయన ఫ్యామిలీ మొత్తం ఈ మూవీకి పనిచేయబోతున్నారు.. ఈ మూవీకి కూడా రమా రాజమౌళినే కాస్ట్యూమ్ డిజైనర్.. అయితే భారీ మూవీ కావడంతో.. హాలివుడ్ టెక్నిషియన్స్ సహాకారం కూడా తీసుకోబోతున్నారు..


ఇక టెక్నిషియన్స్‌ అండ్ యాక్టర్స్‌కు సంబంధించి లెటెస్ట్‌ అప్‌డేట్ ఏంటంటే.. ఇప్పటికే కాస్టింగ్‌కు సంబంధించిన సెలెక్షన్స్‌ కూడా పూర్తైంది.. అన్ని లాంగ్వేజ్‌తో పాటు.. హాలీవుడ్‌ యాక్టర్స్‌ను కూడా సెలెక్ట్ చేశారు.. ఇండియానా జోన్స్‌ మూవీ సీరిస్‌లోని ఓ ఫేమస్ యాక్టర్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.. నిజానికి రాజమౌళి బలం ఎమోషన్స్‌ను పండించడం..ఇందులో కూడా ఎమోషన్స్‌కు చాలా చోటు ఉండటంతో పాటు.. హైప్యాక్డ్‌ యాక్షన్‌ అండ్‌ అడ్వెంచరస్‌గా ఉండనుంది ఈ మూవీ.. నిజం మూవీలో తన ఎమోషన్స్‌ పండించి నంది అవార్డ్ కొట్టారు మహేష్‌బాబు.. ఆ తర్వాతా చాలా మూవీస్‌లో కూడా తనదైన స్టైల్‌లో ఎమోషన్స్‌ పండించాడు.. ఇందులో కూడా మొత్తం మూడు గెటప్స్‌లో కనిపించి మన గుండెలను పిండేయడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది మహేష్‌బాబు..

నెక్ట్స్‌ మ్యూజిక్ విషయాని వస్తే.. ఎప్పటిలాగానే ఈ మూవీకి కూడా కిరవాణినే ట్యూన్స్, బీజీఎం అందిస్తున్నాడు.. దీన్ని షూటింగ్ మొత్తం లండన్‌లోనే జరగనుంది.. నిజానికి పాన్ వరల్డ్ మూవీ కావడంతో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు కిరవాణి. ముందుగా ఇంగ్లీష్‌ సాంగ్స్‌పై ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది..ఇప్పటికే రెండు సాంగ్స్‌కు సంబంధించి రఫ్‌ పార్ట్‌ పూర్తైంది.. ఈ మూవీ మ్యూజిక్ ఇండియన్‌, వెస్ట్రన్‌ మిక్సింగ్‌గా ఉండనుందని తెలుస్తోంది..

అయితే రాజమౌళి అంటే ఆయన టీమ్‌ మాత్రమే ఉంటుంది.. ఇందులో కాస్త చేంజేస్ ఉండేలా కనిపిస్తున్నాయి.. DOP విషయంలో మాత్రం కాస్త మార్పులు చేర్పులు ఉండేట్టు కనిపిస్తోంది.. రాజమౌళి అంటే DOP సెంథిలే గుర్తుకువస్తారు.. ఇప్పటి వరకు ఆయన మూవీస్‌కు ఆయన మాత్రమే పనిచేశారు..కానీ ఈ మూవీకి PS వినోద్‌తో పాటు.. ఓ హాలీవుడ్ ఫేమస్ DOP కూడా పనిచేయనున్నారు.. ఇది మాత్రం బిగ్‌ చేంజ్‌ అనే చెప్పాలి..

ఎందుకు ఈ మూవీకి వెయ్యి కోట్ల బడ్జెట్‌.. ?

అయితే కేవలం రెమ్యూనరేషన్లకే 500 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.. వంద కోట్లు గ్రాఫీక్స్‌ వర్క్‌కు .. మిగిలిన 400 కోట్లు షూటింగ్‌కు వాడనున్నారు.. మరి ఈ మూవీ ఒకటే పార్ట్‌గా వస్తుందా? లేదా రెండు పార్ట్‌లుగా ఉంటుందా? ఇదే ఇప్పుడు కాస్త సస్పెన్స్‌గా ఉంది.. ఎందుకంటే బహుబలి రెండు పార్ట్‌లుగా తీసిన రాజమౌళి.. RRR వచ్చేసరికి సింగిల్‌ పార్ట్‌తో ముగించేశారు.. మరి ఈసారి ఎలా కథను ముందుకు నడిపిస్తారనేది చూడాలి..

రాజమౌళి మూవీ అంటే టైటిలే క్రేజీగా ఉంటుంది..RRR విషయంలో రాజమౌలి, రామారావు, రామ్‌చరణ్‌.. అన్నట్టుగా తీసుకొచ్చి ఎలా సక్సెస్ అయ్యారో…ఈ సారి కూడా అలాంటి కాంబోలోనే టైటిల్‌ డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌ మహారాజా అని తెలుస్తోంది.. యస్.. మహేష్‌బాబు.. రాజమౌళి.. ఈ రెండింటి మిక్స్‌ మహారాజ..క్రేజీగా ఉంది కదా.. మరి ఇది నిజమా? కాదా? అనేది త్వరలోనే తెలుతుంది.. మొత్తానికి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెలుగువాడి ఊహకందని సినిమాగా మన ముందుకు రాబోతుంది మహారాజ అదే.. మహేష్‌బాబు.. రాజమౌళి అప్‌కమింగ్ మూవీ.. ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తాడో చూడాలి.. ఏది ఏమైనా ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు..

Related News

Devara USA Collections : అమెరికా గడ్డ మీద దేవర సేఫ్… ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

Sankranthi Movie 2025: సంక్రాంతి రేసులో ఏకంగా 10 సినిమాలు.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..

Megastar Chiranjeevi : మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మెగాస్టార్..!

Devara First Day Collections : బాక్సాఫీస్ ను షేక్ చేసిన దేవర.. ఊచకోతే మామా.. ఎన్ని కోట్లంటే?

Pooja Hegde : సైలెంట్ గా ఆ పని కానిచ్చేసిన పూజా హెగ్డే?

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Big Stories

×