EPAPER
Kirrak Couples Episode 1

Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!

Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!

Frano Selak| ఈ ప్రపంచంలో కోట్లమంది దురదృష్టవంతులుంటే.. కేవలం వందల సంఖ్యలో అదృష్టవంతులుంటారు. వారిలో అత్యంత అదృష్టవంతుడి పేరు ఫ్రానో సెలాక్. ఇతను క్రోయేషియా దేశానికి చెందిన వాడు. అదృష్టవంతుడు అనగానే ఇతనెవరో అపార సంపన్నుడని అనుకుంటే పొరపాటే.. ఇతను చాలా పేదవాడు. కానీ సాధారణ వ్యక్తి అయినా ఏడు సార్లు చావు నుంచి తప్పించుకున్నాడు. పైగా తన జీవితం చివరి దశలో బంపర్ లాటరీ గెలుచుకున్నాడు.


వివరాల్లోకి వెళితే.. ఫ్రానో సెలాక్.. క్రోయేషియా దేశంలో 1929లో జన్మించాడు. ఇతని జీవితమంతా ఒక సినిమా కథలాగా నడిచింది. నిజం చెప్పాలంటే సినిమా కంటే మరింత ఆశ్చర్యకరంగా నడిచింది. ఫ్రానో సెలాక్ క్రోయేషియాలో ఒక చిన్న మ్యూజిక్ టీచర్ గా పనిచేసేవాడు. అతను జీవితంలో చాలా నిరాశగా ఉండేవాడు. అయితే 1962 సంవత్సరంలో ఫ్రానో సెలాక్ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలయ్యాయి.

జనవరి 1962లో ఫ్రానో ఒకసారి రైలు ప్రయాణం చేస్తుండగా.. ట్రైన్ పట్టాలు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఫ్రానో పాటు అదే కంపార్ట్ మెంటులో ప్రయాణిస్తున్న 17 మంది నదిలో మునిగి పోగా.. ఫ్రానో మాత్రమే బతికి బయటపడ్డాడు.


Also Read: పిల్లులకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. ఆఫీసులో దర్జాగా అవి ఏం చేస్తున్నాయంటే..!

ఆ తరువాత 1963లోనే ఫ్రానో.. విమాన ప్రమాణం చేస్తుండగా.. ఆ ప్లేన్ ఒక సమీపంలో కొండపైన క్రాష్ అయింది. అక్కడ ఒక గడ్డికుప్పపై ఫ్రానో పడ్డాడు. ఈ క్రాష్ లో 19 మందిచనిపోయారు. మూడేళ్ల తరువాత 1963లో ఫ్రానో ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఆ బస్సుల బ్రిడ్జి పై నుంచి కింద ఒక నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు చనిపోగా.. ఫ్రానో గాయాలతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

మరో ప్రాణాంతక ఘటన 1970లో జరిగింది. ఆ సమయంలో ఫ్రానో ఒక కారు కొనుగులు చేశాడు. అందులో ప్రయాణిస్తుండగా.. ఆ కారు పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. కానీ పేలుడు ఒక సెకండ్ ముందే ఫ్రానో కారులోంచి బయటికి వచ్చాశాడు. ఇలాగే మరోసారి 1973లో అతని కారు ఇంజిన్ లో మంటలు చెలరేగి పెట్రోల్ పంప్ పేలిపోయింది. కానీ ఫ్రానోకి ఏమీ జరగలేదు.

మళ్లీ 1995లో జగ్రేబ్ నగరంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఫ్రానో చిన్న చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. 1996లో ఫ్రానో రోడ్డుపై కారులో వెళుతుండగా.. ఒక పెద్ద ట్రక్కు అతడి తలను ఢీకొట్టింది. అది కొండ ప్రాంతం కావడంతో ఫ్రానో రోడ్డుకు అవతలివైపు కొండఅంచున పడ్డాడు. కారు మెల్లగా లోయలోకి జారుతుండగా.. ఫ్రానో సీట్ బెల్లు ఊడిపోయి ముందుగానే కిందపడ్డాడు. కారు లోయలోకి పడిపోయింది. ఇలా మొత్తం ఏడు సార్లు మృత్యువు ఫ్రానోకి సమీపంగా వచ్చి వెళ్లిపోయింది.

Also Read: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

మరో వ్యక్తిగత జీవితం ఫ్రానో పేదవాడు కావడంతో అతను నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. కానీ భార్యలందరూ అతడిని వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో ఫ్రానో వయసు 73 ఏళ్లు ఉన్నప్పుడు అతనికి ఒక మిలియన్ డాలర్ లాటరీ (దాదాపు రూ.8 కోట్ల 36 లక్షలు) గెలుచుకున్నాడు. అయిదో సారి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండేందకు లాటీర డబ్బులతో రెండు ఇళ్లు, ఒక మంచి బోట్ కొనుగోలు చేశాడు. కానీ 2010లో ఫ్రానో తన సంపదను దానం చేసి తన పాత ఇంటకే వచ్చేశాడు. తన సంపదను తన బంధువులు, ఫ్యామిలీ (సోదరి, సోదరులకు), స్నేహితులకు పంచిపెట్టేసి సాధారణ జీవితమే ఉత్తమని చెప్పవాడు.

అలా ఫ్రానో సెలాక్ 2010లో 87 ఏళ్ల వయసులో ప్రశాంతంగా మరణించాడు. ఫ్రానో సెలాక్ జీవితం గురించి అతను రాసిన డైరీ ద్వారా అందరికీ తెలిసింది. అయితే ఫ్రానో రాసింది అంతా అబద్ధమని.. కొన్ని ఘటనలు జరిగినప్పడు అక్కడ అలాంటి ప్రయాణాలు జరగలేదని బిబిసి రిపోర్ట్ లో తేలింది

Related News

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్ గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Bangladesh: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

Big Stories

×