EPAPER
Kirrak Couples Episode 1

OTT Movie : టాప్ 5 మలయాళం కామెడీ హర్రర్ మూవీస్… వీటిని చూస్తే భయంతో పాటు కామెడీ బోనస్

OTT Movie : టాప్ 5 మలయాళం కామెడీ హర్రర్ మూవీస్… వీటిని చూస్తే భయంతో పాటు కామెడీ బోనస్

OTT Movie : మలయాళ సినిమా అంటే చెవి కోసుకునే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌ల నుండి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాల వరకు సినీ ప్రేక్షకులకు మలయాళ మేకర్స్ ప్రత్యేకమైన కథలు, ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లేలు, అద్భుతమైన డైలాగ్‌లతో, నటీనటుల అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు. అయితే అందులో కూడా నవ్విస్తూనే భయపెట్టే హారర్ సినిమాలు ఒక ఎత్తు. మరి ఆ లిస్ట్ పై ఒక లుక్కేద్దాం పదండి.


టాప్ 5 మలయాళ కామెడీ హర్రర్ సినిమాలు
1. రోమంచమ్ (2024)
జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రోమంచం’. దర్శకుడు, అతని స్నేహితులు తమ కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఓయిజా బోర్డ్ గేమ్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ‘రోమంచమ్‌’లో సౌబిన్ షాహిర్ , అర్జున్ అశోకన్, సజిన్ గోపు, సిజు సన్నీ, అబిన్ బినో, అనంతరామన్ అజయ్, అఫ్సల్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. 2023లో విడుదలైన ఈ చిత్రం ఉత్తమ మలయాళ హారర్ సినిమాల్లో ఒకటి. రోమంచం బాక్సాఫీస్ వద్ద తక్షణ బ్లాక్‌బస్టర్‌, ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ మలయాళ చిత్రంగా నిలిచింది.

2. కినవల్లి (2018)
ఉత్తమ మలయాళ హారర్ కామెడీల జాబితాలో తదుపరిది ‘కినావల్లి’. ఈ చిత్రానికి సుగీత్ దర్శకత్వం వహించగా, అజ్మల్ జైన్, విజయ్ జానీ, సురభి సంతోష్, హరీష్ కనరన్, క్రిష్ ఎస్. కుమార్ తదితరులు నటించారు. సినిమా మొత్తం మ్యారేజ్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్న జంటకు జరిగే విచిత్రమైన పరిస్తితుల చుట్టూ తిరుగుతుంది.


3. ఆది కప్యారే కూటమణి (2015)
‘ఆది కప్యారే కూటమణి’ మలయాళ హారర్ కామెడీ సినిమాలలో ఒకటి. 2015లో విడుదలైన ఈ చిత్రానికి జాన్ వర్గీస్ దర్శకత్వం వహించారు. ధ్యాన్ శ్రీనివాసన్, నమిత ప్రమోద్, ముఖేష్, అజు వర్గీస్, నీరజ్ మాధవ్, వినీత్ మోహన్, బిజుకుట్టన్ నటించారు. భానుప్రసాద్ అనే కళాశాల విద్యార్థికి భాను అనే అమ్మాయి ఆమెను తన హాస్టల్‌ నుంచి బయటికి తీసుకెళ్లడానికి పెద్ద మొత్తంలో డబ్బును అందజేస్తుంది. అయితే ఊహించని పరిణామం కారణంగా ఆమె భవనంలో చిక్కుకోవడంతో మూవీ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? లక్ష్మిని రక్షించడంలో భాను సక్సెస్ అయ్యాడా లేక తానే చిక్కుకుపోయాడా? అనేది తెరపై చూడాల్సిందే.

4. కుంజమ్మినిస్ హాస్పిటల్ (2023)
హారర్, కామెడీ, ఫాంటసీని సంపూర్ణంగా మిళితం చేసిన మలయాళ చిత్రం 2023లో విడుదలైన ‘కుంజమ్మినిస్ హాస్పిటల్’. ఈ చిత్రం మరణానంతర జీవితాన్ని అన్వేషించే స్టోరీతో నడుస్తుంది. ఈ మలయాళ హార్రర్ కామెడీకి సనల్ దేవన్ దర్శకత్వం వహించారు.

5. ప్రేతమ్ (2016)
ముగ్గురు స్నేహితులు తమ ఉద్యోగాలను విడిచిపెట్టి, బీచ్‌సైడ్ రిసార్ట్‌ను ప్రారంభించి, ఆ తరువాత అక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీకి బలైపోతారు. ప్రేతమ్ కథాంశం ఈ లైన్ చుట్టూ తిరుగుతుంది. త్వరలో, ముగ్గురు స్నేహితులు రహస్యాన్ని ఛేదించడానికి, వారి హోటల్‌ను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఒక సైకియాట్రిస్ట్ ను కలిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథాంశం. ఈ చిత్రం కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయ్యింది.

Related News

OTT Movie : సైకియాట్రిస్ట్ నే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించే సైకో… హాలీవుడ్ రేంజ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ప్రపంచాన్నే వణికించిన హార్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : మొగుడు దూరంగా ఉన్నాడని ఫ్రెండ్ తో ఎఫైర్… క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదుర్స్ మావా

OTT Movies: ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. ఒకేరోజు 11 సినిమాలు..!

OTT Movie : ఓటిటిలోకి దేవర హీరోయిన్ స్పై థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చు అంటే?

OTT Movie : పావురం తలకు పూజలు చేసే సైకో పిల్ల… చిన్న పిల్లలతో చూడకూడని హార్రర్ మూవీ

Big Stories

×