EPAPER
Kirrak Couples Episode 1

Kaleshwaram Commission : ఏమా తడబాటు… ఈఎన్సీపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం

Kaleshwaram Commission : ఏమా తడబాటు… ఈఎన్సీపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అంశం గత ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్‌ను కమిషన్ ఇవాళ విచారించింది. దాదాపుగా ఈఎన్సీ హరిరామ్‌ను 90కిపైగా ప్రశ్నలను అడిగింది. నిర్మాణ బిల్లుల చెల్లింపుల కోసం ఏర్పాటైన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపైనా కమిషన్ వివరాలను అడిగింది. కానీ పలు ప్రశ్నలకు ఇంజినీర్ ఇన్ చీఫ్ సమాధానం చెప్పలేకపోయారట.


డబ్బులు రిలీజ్ చేసిందెవరు…

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన ఎవరిది ?  మేడిగడ్డ బ్యారేజీకి, కాంట్రాక్టర్ కు బ్యాంక్ గ్యారంటీ సొమ్మును రిలీజ్ చేసిందెవరు ?  దీనికోసం అండర్‌ టేకింగ్‌ తీసుకున్నారా ? కార్పొరేషన్ ఆర్థిక లావాదేవీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించారా ? వాటిని చర్చించాకే శాసన సభలో ఆమోదించారా ?  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారకులెరు లాంటి అనేక ప్రశ్నలను కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు.


తాము అన్ని పత్రాలను ప్రభుత్వానికే పంపించామని సమాధానం ఇచ్చిన హరిరామ్, వాటిని ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిందా లేదా అన్నది తమకు తెలియదన్నారు. ఇవాళ విచారణలో చెప్పని ప్రశ్నలకు రేపు నివేదిక రూపంలో సమర్పిస్తామని కమిషన్‌కు తెలిపారు ఈఎన్సీ హరిరామ్.

కాంట్రాక్టర్లకు రూ.64 వేల కోట్లిచ్చాం…

బ్యారేజీల గేట్లకు మరమ్మతులు లేకే బ్యారేజ్ దెబ్బతిందన్న సీఎన్సీ, 2017 నాటి ఉన్నతస్థాయి కమిటీ మినిట్స్‌ను కాళేశ్వరం సీఈ నిర్లక్ష్యం చేశారన్నారు. బ్యాంకుల నుంచి సేకరించిన రుణాల్లో దాదాపుగా రూ. 64వేల కోట్లను ఇప్పటి వరకు కాళేశ్వరం కార్పొరేషన్ కాంట్రాక్టర్లను చెల్లించిందన్నారు. తీసుకున్న రుణాల్లో రూ. 29,737 కోట్లు తిరిగి చెల్లించామన్నారు.

Also Read : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… వామ్మో సీఎం మనస్సులో ఇవన్నీ ఉన్నాయా ?

విచారణలో ఎస్‌కే జోషి పేరు…

విచారణలో భాగంగా హరిరామ్ తెలంగాణ సీఎస్‌ ఎస్‌కే జోషి, నాటి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇరిగేషన్ మురళీధర్ పేర్లను ప్రస్తావించడం కొసమెరుపు. కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌‌ను 2016లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి, నిధుల సమీకరణ, నిర్వహణ అంతా కూడా ఇదే నిర్వహించిందట.

నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఛైర్మన్‌‌గా వ్యవహరించారు. హరిరామ్‌ ఎండీగా, ఈఎన్సీగా మురళీధర్‌ వ్యవహరించారు. మరోవైపు 2022 జులై 20న సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ జనరల్‌ మురళీధర్‌ పదిరోజుల పాటు పర్సనల్ పని మీద అమెరికా వెళ్లారు. దీంతో ఇన్‌ఛార్జ్ ఈఎన్సీగా హరిరామ్‌ నియమితులయ్యారు.

Related News

Cm Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… వామ్మో సీఎం మనస్సులో ఇవన్నీ ఉన్నాయా ?

High court on Hydra : హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర… రమ్మని కమీషనర్ రంగనాథ్‌కు నోటీసులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Pravasi Prajavani: ప్రజా భవన్‌లో ప్రవాసి ప్రజావాణి, తరలివచ్చిన ఎన్నారైలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాలేజీ బస్సులు ఢీ.. 20 మంది విద్యార్థులు!

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, సీఎం సహాయనిధికి 20 కోట్లు..

Big Stories

×