EPAPER
Kirrak Couples Episode 1

Rajamouli Sentiment : ఇంతకీ రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా.?

Rajamouli Sentiment : ఇంతకీ రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా.?

Rajamouli Sentiment : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి ఎంత వాల్యూ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమాకి సంబంధించి షాట్ పెట్టాలి అన్న కూడా ముహూర్తం చూస్తారు. ఇక ఎప్పటినుంచో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి హీరోల సెంటిమెంట్ ఒకటి ఉంది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గరనుంచి మొదలుపెడితే రాజమౌళి లేటెస్ట్ గా చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా వరకు రాజమౌళి సినిమాల్లో పనిచేసిన హీరో ఆ తర్వాత ఏ దర్శకుడు తో పనిచేసిన కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ వచ్చింది. ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి చాలామంది దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ అవి ఏవి వర్కౌట్ కాలేదు.


ఇక రీసెంట్ గా కొరటాల శివ రాజమౌళి పనిచేసిన ఇద్దరు హీరోలతో కూడా సినిమాలు చేసాడు. దానిలో ఒక సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయగానే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటివరకు ఒక ఫ్లాప్ సినిమా కూడా లేని తన కెరీర్లో డిజాస్టర్ ఆచార్య సినిమాతో ఒక డిజాస్టర్ అందుకున్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా రిలీజ్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి ఒక వేదికపై మాట్లాడుతూ రాజమౌళి సెంటిమెంట్ ఈ సినిమాతో బ్రేక్ అవ్వబోతుంది అని కూడా చెప్పేసారు. కానీ ఆ సినిమా బెడిసి కొట్టింది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాను చేసాడు కొరటాల శివ. ఇక ప్రేక్షకులు ముందుకు వచ్చిన దేవర సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చింది. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి హీరో సెంటిమెంటును శివ ఈ సినిమాతో బ్రేక్ చేసాడు అని చెబుతుంటే, ఇంకొంతమంది సినిమా అభిమానులు రాజమౌళి సెంటిమెంట్ ఇంకా బ్రేక్ కాలేదు. సినిమా అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఫస్ట్ అఫ్ చాలామందిని ఆకట్టుకున్న కూడా సెకండ్ హాఫ్ ఊహించిన స్థాయిలో లేదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఏదేమైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసిన ప్రేక్షకుల అంచనాలను మించి ఆ సినిమా ఫలితాన్ని తీసుకెళ్తాడు. ఒక సినిమా కొన్ని ఏళ్లు పాటు తెరకెక్కిస్తాడు కాబట్టి రాజమౌళిని జక్కన్న అని అంటారు. ఏదైనా కూడా ఒక దర్శకుడికి ప్రేక్షకుల పల్స్ తెలియాలి అంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలిసిన ఏకైక దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఏ దర్శకుడికైనా ఏదో ఒక స్థాయిలో ఒక ఓటమి అనేది ఉంటుంది. అలా ఇప్పటివరకు ఒక్క డిజాస్టర్ కూడా చవిచూడని దర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి ఒక్కరే ఉన్నారని చెప్పొచ్చు.

Related News

Kirak RP : ఆర్పీ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు…

Devara: నిలబడింది తారక్ , కానీ నిలబెట్టింది అనిరుధ్

Devara 2 : దేవర పార్ట్ 2 తెరకెక్కితే ఇవి తెలియాలి

Prithviraj : ఆ సినిమాకు ముందు నాకు అవకాశాలు లేవు, ప్రస్తుతం 23 సినిమాలు చేస్తున్నాను

Amaran: మేజర్ భార్యగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్..!

Koratala Siva: అసలు ఏమి స్కోప్ ఉందని “దేవర” పార్ట్ 2 అనౌన్స్ చేశారు

Big Stories

×