EPAPER
Kirrak Couples Episode 1

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Employee Dies On Duty: సిక్ లీవ్ ఇవ్వడానికి నిరాకరించిన బాస్.. ఫ్యాక్టరీలో మరణించిన మహిళా కార్మికురాలు!

Employee Dies On Duty| ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా దేశంలో ఇటీవల ఇద్దరు మహిళలు మరిణించిన రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పై పనిఒత్తిడి చేస్తున్న కంపెనీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శులు వెలువెత్తుతున్నాయి. రెండు వారాల క్రితం ప్రముఖ ఆడిటింగ్ కంపెనీ ‘అర్నెస్ట్ అండ్ యండ్’ లో పనిచేసే ఒక యువతి అనూహ్యంగా మరణించడంతో కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ కేసులో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే హెడిఎఫ్‌సి బ్యాంకులో పనిచేసే మరో మహిళా ఉద్యోగి ఆఫీసులోని చనిపోవడం సంచలనంగా మారింది. ఇలాంటిదే మరో కేసు థాయ్ ల్యాండ్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. థాయ్ ల్యాండ్ దేశంలోని సుఖోథాయ్ రాష్రానికి చెందిన ‘మే’ అనే 30 ఏళ్ల యువతి డెల్టా ఎలెక్ట్రానిక్స్ కంపెనీ ఫ్యాక్టరీలో కార్మికురాలిగా ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెకు కడుపులో నొప్పి కారణంగా సెప్టెంబర్ మొదటివారంలో ఆస్పత్రికి వెళ్తే.. ఆమె పెద్ద పేగులో వాపు ఉందని చిన్న ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో ఆమె ఆరు రోజులు సెలవు తీసుకొని సెప్టెంబర్ 5న ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆరు రోజులు పూర్తి అయిన తరువాత కూడా ఆమె ఆరోగ్యంలో ఏ మార్పు రాలేదు. దీంతో ఆమె ఆస్పత్రి వెళ్లి సరైన చికిత్స తీసుకోవడానికి తన మేనేజర్ కు ఫోన్ చేసి మరికొన్ని రోజులు సిక్ లీవ్ (సెలవు) ఇవ్వాలని కోరింది.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


కానీ మేనేజర్ అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే ఆరు రోజుల సెలవు తీసుకున్నందుకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెంటనే డ్యూటీకి రావాలని ఆదేశించాడు. ఇది విని మే తన ఉద్యోగం పోతుందని భయపడి.. ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్లింది. అయితే ఆమె డ్యూటీకి వచ్చిన 20 నిమిషాల తరువాత కుప్పకూలిపోయింది. సహోద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కొన్ని గంటల తరువాత మే మరణించింది.

ఈ ఘటన గురించి ఆమె సహోద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంతకుముందు ఎన్నడూ మే.. సెలవు తీసుకోలేదని.. అలాంటిది ఆమె తీవ్రంగా అనారోగ్యం చేస్తే.. మేనేజర్ చాలా కఠినంగా వ్యవహరించాడని తెలిపారు. మే పట్ల మేనేజర్ తీరుని తప్పపడుతూ నెటిజెన్లు విపరీతంగా పోస్ట్ లు పెట్టడంతో ఈ వార్త వైరల్ అయింది.

దీంతో కంపెనీ సిఈవో ఈ విషయంపై స్పందిస్తూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మే కుటుంబానికి అండగా ఉంటామని.. తమ ఉద్యోగుల క్షేమం కోసం ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ.. జరిగిన ఘటన గురించి విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

Related News

Employee Fired For Not bring Food For Boss: టిఫిన్ తీసుకురాలేదని ఉద్యోగిని తొలగించిన బాస్.. ఆ తరువాత..

Viral Video: హిప్పోపోటమస్ దంతాలను ఎలా క్లీన్ చేస్తారో చూశారా.. వీడియో వైరల్

Viral News: చెయ్యని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీ.. ఇన్నాళ్లకు నిర్దోషి అని తీర్పు

Viral News: బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త

Viral Video: యజమాని పిల్లలను కాపాడేందుకు కింగ్ కోబ్రాతోనే ఫైటింగ్ చేసిన శునకం

Viral News: ఆటో డ్రైవర్ ఆ మజాకా.. ! డ్రైవర్ సీటు చూస్తే షాక్ అవుతారు

Big Stories

×