EPAPER
Kirrak Couples Episode 1

Anil Ambani: రూ.లక్ష పెట్టుబడితో రూ.39 లక్షల లాభం, అనిల్ అంబానీ షేర్ హోల్డర్లకు అదిరిపోయే న్యూస్!

Anil Ambani: రూ.లక్ష పెట్టుబడితో రూ.39 లక్షల లాభం, అనిల్ అంబానీ షేర్ హోల్డర్లకు అదిరిపోయే న్యూస్!

Anil Ambani Company Share Price: భారతీయ వ్యాపార రంగంలో అనిల్ అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తండ్రి ధీరూ భాయ్ అంబానీ ఇచ్చిన ఆస్తిని కాపాడుకోలేక, అప్పుల పాలయ్యాయ్యారు. అన్న ముఖేష్ రోజు రోజుకు అపర కుబేరుడుగా మారితే, అనిల్ అంతకంతకూ ఆర్థికంగా దిగజారిపోయారు. ఒకటి రెండుసార్లు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుకునేందుకు సాయం చేసినా అప్పుల ఊబిలో నుంచి బయట పడలేకపోయారు. ఒకప్పుడు ఇండియాలో లీడింగ్ కంపెనీగా ఉన్న రిలయన్స్ టెలికాం సంస్థ సైతం అమ్మేశారు. ఆ తర్వాత ఆయన వ్యాపారాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.


చాలా ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్

తాజాగా ఆయన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ మంచి దూకుడు కొనసాగిస్తోంది. ఆయన కంపెనీ ఇప్పుడు రూ. 16,000 కోట్ల మార్కెట్ క్యాప్‌కు ఎదిగింది. గత వారంలో కంపెనీ షేర్లు రూ.15.53 నుంచి ఏకంగా రూ.40కి పెరిగాయి. రిలయన్స్ పవర్ స్టాక్ చాలా రోజు తర్వాత అసాధారణ వృద్ధిని సాధించింది. వరుసగా ఏడవ రోజు కూడా షేర్ వ్యాల్యూ పెరిగింది. సెప్టెంబర్ 26న, దాని షేరు ధర ₹44.16కి చేరుకుంది. ముందు రోజుతో పోల్చితే 5% పెరిగింది.


రూ. 1 లక్ష  ఇప్పుడు రూ. 39 లక్షలు  

గత ఏడాది రిలయన్స్ పవర్ షేర్లు 132% పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ 26న ఈ కంపెనీ షేరు ధర ₹18.99గా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26కు వచ్చే సరికి రూ.44.16కి పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ కంపెనీ  షేరు ధర 60% పెరిగింది.  గత 4.5 సంవత్సరాలలో స్టాక్ విలువ ఏకంగా 3807% పెరిగింది. మార్చి 2020లో  స్టాక్ ధర కేవలం రూ.1.13గా ఉంది. అంటే 2020లో ఎవరైనా ఈ కంపెనీలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి  షేర్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఆ విలువ రూ 39.07 లక్షలకు చేరింది. ఈ దెబ్బతో రిలయన్స్ పవర్ ఆర్థికంగా బలమైన వృద్ధిని సాధిస్తోంది. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచుతోంది.

త్వరలో రిలయన్స్ పవర్ అప్పులు మాయం 

గతంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రిలయన్స్ పవర్ ఇప్పుడు అప్పులు లేని కంపెనీగా ఎదగబోతోంది. ఇటీవల సింగపూర్‌కు చెందిన వార్డే పార్ట్‌ నర్స్‌ కు ఈ కంపెనీ రూ.850 కోట్లను ప్రీపెయిడ్ చేసింది. ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ పవర్ అప్పుల నుంచి పూర్తిగా బయటపడే స్థితికి చేరుతోంది. ఉత్తరప్రదేశ్‌ లోని బొగ్గు ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి చెల్లించాలని భావిస్తోంది. ఈ అప్పులు తీరితే రుణ రహిత కంపెనీగా మారనుంది. రిలయన్స్ పవర్ డిసెంబర్ 2023లో రుణాలు తీర్చడంలో కీలక ముందడుగు వేసింది. కంపెనీ భారీ అప్పులను తిరిగి చెల్లించడం ప్రారంభించింది. మార్చి 2024 నాటికి రూ.1,023 కోట్ల రుణాలను తిరిగి చెల్లించగా, ఆగస్టులో మరో రూ.800 కోట్లు చెల్లించింది. ఇటీవల, కంపెనీ రూ. 3,872 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించి, రుణ రహిత హోదాను పొందింది.

Read Also:బంగారం కొనే ఉద్దేశం ఉందా? అయితే ముందుగా ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసుకోండి..

Related News

New Maruti Suzuki DZire: పండక్కి సరికొత్త మారుతి సుజుకి డిజైర్, అందుబాటు ధరలోనే.. అద్భుతమైన ఫీచర్స్

Gold Rate Today: బంగారం కొనే ఉద్దేశం ఉందా? అయితే ముందుగా ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసుకోండి..

Vande Bharat Express: ఖాళీగా నడుస్తోన్న సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. రైల్వే షాకింగ్ నిర్ణయం

Festive Discounts: పాపులర్ సెడాన్లపై పండుగ ఆఫర్లు, వెంటనే కొనుగోలు చేస్తే రూ. లక్షకు పైగా డిస్కౌంట్!

Indian Railways: భారత్‌లో ఈ రైల్వే స్టేషన్ చాలా స్పెషల్, ఫ్లాట్ ఫారమ్ మీదకి వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే!

iphone 16 Delivery in 10 minutes : పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..

Big Stories

×