EPAPER
Kirrak Couples Episode 1

50 women Cheated: ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

50 women Cheated: ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

50 women Cheated| దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు ఒక మహా మోసగాడిని పట్టుకున్నారు. ఆ మోసగాడు ఏకంగా 50కుపైగా మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. అందులో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉండడం గమనార్హం. మోసపోయిన మహిళల్లో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గడ్‌కు చెందిన నిందితుడు ముఖీం అయుబ్ ఖాన్ (38) 2014లో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అయుబ్ ఖాన్ ఒక ప్లాన్ వేశాడు. 2020లో మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో మారుపేరుతో ఒక ఐడి క్రియేట్ చేశాడు. తనకు వధువు కావాలని, తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొన్నాడు. పైగా అతను 30 ఏళ్లు పైబడిన మహిళ కావాలని ప్రత్యేకంగా చెప్పడంతో.. అతని వలలో చాలామంది భర్త చనిపోయిన, విడాకులు తీసుకున్న మహిళలు పడ్డారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..


ఎవరైనా అతను మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన యాడ్ ను చూసి స్పందిస్తే.. వారితో తరుచూ ఫోన్లో మాట్లాడి వారిత స్నేహం చేసేవాడు. కొన్ని సార్లు తన డబ్బు ఖర్చు పెట్టి సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లాడు. దీంతో సదురు మహిళ అతడిని పూర్తిగా నమ్మిన తరువాత తన జీవితంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని, తన భార్య చనిపోయిందని, బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నానని లేని కారణాలు చూపి వారి నుంచి వేలు, లక్షలు తీసుకునేవాడు. ఒక్కసారి అతని చేతిలో డబ్బు పడిందా.. ఆ వెంటనే వారితో కనెక్షన్ కట్ చేసుకుంటాడు. ఇక వారికి జీవితంలో కనిపించడు.

ఇలాగే ఒక మహిళా న్యాయమూర్తిని కూడా బురిడీ కొట్టించాడు. ఆమె భర్త చనిపోయవడంతో అయుబ్ ఖాన్ ఇచ్చిన యాడ్ చూసి స్పందించింది. అయుబ్ ఖాన్ ఒక హిందువు పేరుతో ఆమెతో పరిచయం చేసుకొని ప్రేమ వ్యవహారం నడిపాడు. తనకు భార్య చనిపోయిందని, తనకు ఒక్క కూతురు ఉందని చెప్పి ఆమె నమ్మించాడు. కేవలం రెండు మూడు సార్లు ఆమెను నమ్మించి చివరిసారి కలిసినప్పుడు ఆమె వద్ద నుంచి రూ.30000 తీసుకొని పరారయ్యాడు. అయుబ్ ఖాన్ బాధితుల్లో ఎక్కువగా ముస్లిం మహిళలే ఉండడంతో వారిలో కొంత మంది మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

ఎవరైనా తనకు డబ్బులు ఇవ్వకపోతే వారిని నమ్మించేందుకు వారి తల్లిదండ్రులు, కుటుంబంతో కూడా కలిసి మాట్లాడేవాడు. పెళ్లి త్వరలోనే పెట్టుకుందామని నమ్మించి.. చివరి నిమిషంలో ఒక ఫంక్షన్ హాల్ చూపించి అందులో పనిచేసే మేనేజర్ లేదా ఓనర్ తన స్నేహితుడని, తన చేతికి డబ్బులిస్తే.. తక్కువ ఖర్చు అవుతుందని బుకాయించేవాడు. అలా డబ్బుతీసుకొని మాయం అయిపోయేవాడు. 2023లో అయుబ్ ఖాన్ ఢిల్లీలోని ప్రీతి విహార్ ప్రాంతానికి చెందిన మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత ఆమె నగలు తీసుకొని మాయమైపోయాడు.

పోలీసులకు అయుబ్ ఖాన్ పై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే అయుబ్ ఖాన్ తరుచూ ఊరు, పేరు మారుతుండడంతో పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు ఒక రోజు అయుబ్ ఖాన్‌ని పట్టుకునేందుకు వల పన్నారు. గుజరాత్ వడోదరాలో నిందితుడు అయుబ్ ఖాన్ ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. అతను అక్కడ కూడా ఒక మహిళతో పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లాడు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

అక్కడ కథ నడిపిస్తూ ఉండగా.. పోలీసులు ఒక మహిళ ఐడితో అతడిని సంప్రదించారు. పెళ్లి సంబంధం కోసం ఢిల్లీ రావాలని చెప్పారు. దీంతో అయుబ్ వెంటనే ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ లో పోలీసులు అయుబ్ ఖాన్ ఘనస్వాగతం పలికి అరెస్టు చేశారు. పోలీసులు అతడిని విచారణ చేస్తుండగా.. అయుబ్ ఖాన్ తాను మొత్తం 50కు పైగా మహిళలను మోసం చేశానని తెలిపాడు.

Related News

SchoolBoy Human Sacrifice: నరబలి.. స్కూల్ సక్సెస్ కోసం 2వతరగతి పిల్లాడి హత్య!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

Fighting Between Customers: జ్యూస్ సెంటర్ వద్ద ఫైటింగ్.. ఎనిమిది మందికి గాయాలు, ఎలా జరిగింది?

Bengaluru fridge Murder: బెంగుళూరు ఫ్రిడ్జ్ మర్డర్ కేసులో నిందితుడు మృతి.. ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న హంతకుడు

OYO Hotel Owner Cheats Customer: కస్టమర్‌ను మోసం చేసిన ఓయో హోటల్ ఓనర్.. మండిపడిన కోర్టు!

Tenant Videos Recorded with hidden cameras : బాత్‌రూమ్, బెడ్ రూమ్ లో రహస్య కెమెరాలు.. యువతి వీడియోలు రికార్డ్ చేసిన ఇంటి ఓనర్!

Big Stories

×