EPAPER
Kirrak Couples Episode 1

Bigg Boss 8 Promo : నాన్ స్టాప్ కామెడీ… ఇది కదా బాస్ కావాల్సింది

Bigg Boss 8 Promo : నాన్ స్టాప్ కామెడీ… ఇది కదా బాస్ కావాల్సింది

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతానికి డే 26 కి చేరుకుంది. కానీ ఇప్పటిదాకా హౌస్ లో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ దొరకలేదు బిగ్ బాస్ ప్రియులకు. ఎప్పుడు చూసినా గొడవలు, ఒకరిపై ఒకరు అరుచుకోవడమే  తప్ప ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది లేదు కంటెస్టెంట్స్. అందుకే బిగ్ బాస్ ఈరోజటి ఎపిసోడ్లో పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను చూపించబోతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా రిలీజ్ అయిన డేట్ 26 రెండవ ప్రోమోలో చూపించారు.


హౌస్ మేట్స్ కు ఫన్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోని చూస్తుంటే ఈరోజటి ఎపిసోడ్ కంప్లీట్ గా ఫన్ తో నిండిపోయిందని అనిపిస్తుంది. అందులో హౌస్ మేట్స్ ఒకరిని మరొకరు ఇమిటేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో, ఇప్పటిదాకా ఇంట్లో జరిగిన పలు సంఘటనలను గుర్తు చేస్తూ ఒకరిని మరొకరు ఇమిటేట్ చేస్తూ నవ్వించారు. ముఖ్యంగా ప్రోమోలో సోనియా, పృథ్వి, నిఖిల్ మధ్య నడిచే డిస్కషన్స్, గొడవలను, అలాగే మణికంఠ, విష్ణు ప్రియ – పృథ్వీ ల గురించి ఇమిటేట్ చేస్తున్నట్టు ఫన్నీగా చూపించారు ప్రోమోలో. అంతేకాకుండా నబిల్.. ఆదిత్య ఓం లాగా ఇమిటేట్ చేసి ప్రోమోలో హైలెట్ గా నిలిచారు. మొత్తానికి ఒకరినొకరు హౌస్ లో జరిగిన రాద్ధాంతాలను, ఫన్నీ విషయాలను మరింత కామెడీగా ఇమిటేట్ చేసి ప్రోమోను చూస్తున్నంత సేపు నవ్వుకునేలా చేశారు. మొత్తానికి ఈరోజటి ఎపిసోడ్ కూడాఇలాగే ఫన్ తో కొనసాగిపోతుందని అర్థమవుతుంది. కానీ బిగ్ బాస్ ప్రేక్షకులు అల్మోస్ట్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నే కోరుకుంటున్నారు. అయితే హౌస్ మేట్స్ మాత్రం గొడవ పడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోని చూశాక బిగ్ బాస్ ఆడియన్స్ ఇది కదా బాస్ కావలసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


గెస్ ది సౌండ్ విన్ అయింది ఎవరంటే?

ఇక డే 26కు సంబంధించిన మొదటి ప్రోమోలో గెస్ ది సౌండ్ అనే టాస్ ను బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చారు. అందులో కాంతారా క్లాన్ తో పాటు శక్తి క్లాన్ కూడా పాల్గొంది. బిగ్ బాస్ ముందుగా కొన్ని సౌండ్స్ ని వినిపించి, వాటిని తను వినిపించిన వరుస క్రమంలోనే రాయాలని హౌస్ మేట్స్ ను ఆదేశించారు. ఆ టాస్క్ లో నిఖిల్, ప్రేరణ కంబం, నాగ మణికంఠ, నైనిక తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రోమోలో ఈ టాస్క్ లో విన్ అయ్యింది ఎవరు అన్న విషయాన్ని మేకర్స్ బయట పెట్టలేదు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం నిఖిల్ టీమైన శక్తి క్లాన్ ఇందులో విన్ అయినట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు కనీసం ఒక్కరోజైనా బిగ్ బాస్ ఈ ఫన్ టాస్క్ ను ఇచ్చి హౌస్ వైఫ్ మధ్య గొడవలు లేకుండా, చూసే ప్రేక్షకులు కాసేపు మనసారా నవ్వుకునేలా టాస్క్ లను ప్లాన్ చేసి మంచి పని చేశారు అంటున్నారు బిగ్ బాస్ ప్రియులు.

Related News

Bigg Boss: నబీల్ ప్రేయసిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Bigg Boss 8 Promo : గేమ్ ఛేంజింగ్ ట్విస్ట్… విష్ణు ప్రియ హానెస్ట్, పృథ్వి ఫేక్ లవ్ స్టోరీ బయట పెట్టిన బిగ్ బాస్

Bigg Boss: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

Bigg Boss 8 Day 26 Promo 1: గెస్ ద సౌండ్స్.. కడుపు నింపుకోవడానికి ఎన్ని తిప్పలో..!

Bigg Boss 8 Day 25 Promo 2: క్లాన్ వర్సెస్ క్లాన్.. కాంతారా రూట్ తొలగినట్లేనా..?

Bigg Boss 8 Day 25 Promo 1: టాస్క్ పేరుతో లవ్ ట్రాక్ మొదలు.. అమ్మాయి మోములో సిగ్గుమొగ్గలు..!

Big Stories

×