డాండ్రస్ సమస్యకు ఇంటి చిట్కాలు

తలకు ఎక్కువ సేపు నూనె పట్టించ ఉంచకూడదు దాని వల్ల డాండ్రాఫ్ ఇంకా పెరుగుతుంది.

యాపిల్ సైడర్ వినేగర్: చిన్న గ్లాసులో సగ భాగం నీరు, సభ భాగం వినేగర్ కలిపి దాంతో తలకు అరగంట సేపు పట్టించి ఆ తరువాత తలస్నానం చేయాలి.

షాంపూ లో కాస్త బేకింగ్ సోడా కలిపి తలస్నానం చేస్తే  డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

 వేపాకుని బాగా నూరి ఆ తరువాత దాన్ని కాస్త వేడి నీటిలో కలిపి తలకు పట్టించి మెల్లగా మర్దన చేయాలి.

షాంపులో కేవలం రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించి తలస్నానం చేయాలి.

అలోవేరా కొమ్మల నుంచి ఆలోవేరా జ్యూస్ తీసుకొని ఏదైనా డాండ్రఫ్ షాంపులో కలిపి ఉపయోగించండి.

రెండు వెల్లులి రెబ్బలు బాగా క్రష్ చేసి ఆ పేస్ట్ ని నీటిలో కలిపి తలకు పట్టించండి. కావాలంటే అందులో కాస్త తేనె, అల్లం(పేస్ట్) కూడా కలుపుకోవచ్చు.