EPAPER
Kirrak Couples Episode 1

YS Jagan Press Meet: పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్.. కావాలనే అడ్డుకున్నారు.. జగన్ కామెంట్స్

YS Jagan Press Meet: పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్.. కావాలనే అడ్డుకున్నారు.. జగన్ కామెంట్స్

ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను పిలిపించారని.. ఇది బీజేపీ పెద్దలకు తెలుసో? తెలియదో? అని జగన్ చెప్పారు. తిరుమలకు అనుమతి లేదంటున్నారని.. మాజీ సీఎంకు స్వామిని దర్శించుకునే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు.

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసి దేవుడి పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని అన్నారు. తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అబద్ధాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.


Also Read:  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారా?

జులై 23నే ఈవో.. రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యి వాడలేదని క్లియర్‌కట్‌గా చెప్పారని.. సెప్టెంబర్‌ 18న చంద్రబాబు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ను కలిపారని ఆరోపించారన్నారు. సెప్టెంబర్‌ 19న టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను విడుదల చేశారన్నారు. సెప్టెంబర్‌ 20న ఈవో మీడియాతో మాట్లాడుతూ రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని ధృవీకరించారన్నారు. సెప్టెంబర్‌ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఈవో ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సెప్టెంబర్ 19న టీడీపీ వాళ్లు రిలీజ్‌ చేస్తారన్నారు. కాన్ఫిడెన్షియల్లి నెయ్యిని NDDB ల్యాబ్ గుజరాత్‌లో టెస్టులను చేశామని, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపిషోకాజ్ నోటీసులు ఇచ్చామని ప్రభుత్వానికి ఈవో రిపోర్ట్ ఇచ్చారని.. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ టీడీపీ ఆఫీసులో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. సెప్టెంబర్ 22న చంద్రబాబు మళ్ళీ ట్యాంకర్లు వాడారని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు స్వామి వారి ప్రసాదం, తిరుమల విశిష్ఠతను అబద్దాలతో తగ్గించారని మండిపడ్డారు. ఇదంతా పవిత్రత కాదా అంటూ ప్రశ్నించారు.

నా మతంపై ఇంత రాజకీయం చేస్తున్నారని.. అసలు నా మతమేంటని ప్రశ్నించారు. తాను అన్ని మతాలను పాటిస్తానని తెలిపారు. నాలుగు గోడల మధ్య బైబిల్‌ చదువుతానని.. బయటకు పోతే హిందూత్వాన్ని, ముస్లిం, సిక్కు మతాలను గౌరవిస్తా.. అనుసరిస్తానని వెల్లడించారు. తిరుమలకు వస్తానంటే డిక్లరేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం శోచనీయమని ఆరోపించారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

Related News

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

YS Jagan: ఇంట్లో నేను బైబిల్ చదువుతా.. బయట మాత్రం..: జగన్

Prakash Raj : జస్ట్ ఆస్కింగ్… పవన్‌ను ప్రశ్నించావు సరే, స్టాలిన్‌ను వదిలేశావు ఎందుకు ?

Tirumala Declaration Row: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. అప్పట్లో డిక్లరేషన్ ఇచ్చారా?

TTD Ex EO Dharmareddy: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Big Stories

×