Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడవులు, సముద్రాల్లో జీవించే జంతువుల గురించి ఎక్కువగా వీడియోలు నెట్టింట వస్తుంటాయి. ప్రత్యేకంగా నీటిలో నివసించే జంతువులు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. నీటిలో నివసించే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా హిప్పోపోటమాస్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా అయితే మనుషులు స్నానాలు చేయడం, పళ్లు తోముకోవడం వంటివి చేస్తుంటారు. కానీ మనుషులు చేసే పని జంతువులు చేయలేవు. ఎందుకంటే జంతువుల కంటే మనుషులకు లోక జ్ఞానం, విచక్షణ వంటివి ఉంటాయి. అందువల్ల మనుషులు వారి శరీరాన్ని శుభ్రపరుచుకోగలుగుతారు. కానీ జంతువులకు మాత్రం అలాంటివి చేయడం సాధ్యం కాదు. అయితే జంతువులు కూడా ఇలాంటి పనులు చేస్తాయంటే ఎవరైనా నమ్ముతారా. అందులోను హిప్పోపోటమన్ పళ్లు తోముకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హిప్పోపోటమస్ కోసం ఉన్న కేర్ టేకర్స్ దానికి పళ్లు తోమిస్తున్నారా. పైపుతో దానికి స్నానం పోసి, పళ్లు తోమేందుకు పెద్ద పొడవాటి బ్రష్ ను దాని నోట్లోకి పెట్టి తోముతున్నారు. అయితే ఈ దృశ్యం ఏదో జూలో జరిగినట్లు అనిపిస్తుంది. జూలో ఉండే జంతువులను ఎప్పటికి అప్పుడు జాగ్రత్తగా చూసుకునేందుకు ఉండే కేర్ టేకర్స్ నీటి తిమింగలం పళ్లను శుభ్రం చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా షఆక్ అవుతున్నారు.
Hippos getting their teeth cleaned pic.twitter.com/dY5mrY669P
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) September 23, 2024