EPAPER
Kirrak Couples Episode 1

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Botsa Satyanarayana Strategy Behind Party Change of YCP Leaders: ఓటమి తర్వాత వైసిపికి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలు పార్టీని వదిలి తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారంట. దసరా తర్వాత మంచి రోజు చూసుకుని ఆయన ఆ లాంఛనం పూర్తి చేస్తారంటున్నారు. ఇప్పటికే పలువురు విజయనగరం జిల్లా నేతలు జనసేన బాట పట్టారు. బొత్స సహా వైసీపీ పెద్దలు వారిని నియత్రించే ప్రయత్నం కూడా చేయడం లేదు. దాంతో ఈ చేరికల వెనుక బొత్స వ్యూహం ఉందా.


విజయనగరం జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. ఇంతకాలం వైసీపీలో పెత్తనం చెలాయించిన బీసీ , కాపు నేతలు వైసీపీకి షాక్ వీడి జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికల నాటికి మెజార్టీ కాపు నేతలు జనసేన పంచకు చేరతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి వర్గం ఎపుడెప్పుడు పార్టీ మారదామా అని చూస్తున్నారంట. ఎమ్మెల్యే అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలని పట్టించుకొకపోవడం, గత ప్రభుత్వ హయంలో జరిగిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం లాంటి పరిణామాలన్నీ వారిని జనసేన వైపు చూసేలా ప్రోత్సాహిస్తున్నాయట.

వైసీపీ శ్రేణులు సైకిలెక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. గ్రీన్ సిగ్నెల్ రావడం లేదంట.  ముఖ్యంగా జిల్లా పెద్దగా ఉన్న అశోక్ గజపతి పార్టీలోకి ఏ ఒక్కరినీ చేర్చుకోవడానికి ససేమిరా అంటున్నారంట. ఎన్నికలు తరువాత చేరికల తతంగం ఇదంతా భారమే తప్ప , ఉపయోగం ఏముందనే ధోరణిలో ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారట. విజయనగరంలోని సగానికి సగం మంది కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా గజపతిరాజు మాత్రం అంగీకరించడం లేదంటున్నారు. టీడీపీ మిగిలిన నేతలు కూడా ఆశోక్ మాట జవదాటే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో ఇమడలేని వారంతా జనసేన కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారంటున్నారు.


Also Read: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

మరోవైపు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారనే గుసగుసలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన అనుయాయులు సైతం జనసేనలో చేరడానికి రెడీ అవ్వడమే అంటున్నారు .. ఆయన దగ్గర శిష్యరికం చేసి, నిన్న మొన్నటివరకూ ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసిన నెల్లిమర్ల నాయకుడు చనమల్లు వెంకటరమణ , విజయనగరం మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ అవనవు భావన దంపతులు , సాలూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ జరజాపు దీప్తి, మరికొందరు కార్పొరేటర్లు సైతం ఇప్పటికే జనసేనలో జాయిన్ అయ్యారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని , వరుస చెరికలు ఉంటాయంటున్నారు.

బొత్స తమ్ముడు లక్ష్మణరావు కూడా త్వరలోనే జనసేన తీర్ధం పుచ్చుకొనున్నట్లు తెలుస్తోంది . గత ఎన్నికల్లో ఈయన నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి లోకం మాధవికి గెలుపుకోసం కృషి చేశారు . నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2029 నెల్లిమర్ల సీటు ఆయనకు కేటాయిస్తరనే టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకుంటున్నారంట. దానికి బొత్స సత్యనారాయణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నియోజకవర్గంలో ఉన్న తన అనుచరుల్ని కూడా లక్ష్మణరావుతో పాటే జనసేనలోకి వెళ్లడానికి బొత్స సిగ్నల్స్ ఇచ్చారంట.

వైసీపీ జిల్లా అద్యక్ష పదవిని మరోమారు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకే కట్టబెట్టడం మెజార్టీ వైసీపీ నాయకులకు నచ్చడం లేదట. మజ్జి శ్రీనుని ఎన్నికలకు చాలా ముందు నుంచే బొత్స దూరంగా పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మజ్జి శ్రీనుకి టికెట్ దక్కకుండా బొత్సానే చక్రం తిప్పారు. అలాందిప్పుడు జగన్ తిరిగి మజ్జి శ్రీనునే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో బొత్స వర్గం తీవ్ర అసంతృప్తితో కనిపిస్తుంది. అందుకే బొత్స కూడా జగన్‌ నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారంటున్నారు. ఆ లెక్కలతోనే విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి పెరుగుతున్న వలసల వెనుక బొత్స పేరు ఫోకస్ అవుతోంది.  చూడాలి మరి ఈ పొలిటికల్ డ్రామా ఎటు నుండి ఎటు దారితీస్తుందో.

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×