EPAPER
Kirrak Couples Episode 1

Harsha Sai: బయటకొస్తున్న హర్షసాయి దారుణాలు.. బాధితులు చెబుతున్నదాంట్లో నిజమెంత..?

Harsha Sai: బయటకొస్తున్న హర్షసాయి దారుణాలు.. బాధితులు చెబుతున్నదాంట్లో నిజమెంత..?

ఈమె మరో బాధితురాలు.. అయితే హర్షసాయి ఈమెను లైంగికంగా వేధించలేదు కానీ.. తన అవసరాన్ని చులకనగా చూశాడని.. తనను అవమానించాడని చెబుతోంది. అంతేకాదు.. అందరికి సాయం చేస్తానని గొప్పలు చెప్పడమే కానీ.. నిజానికి అక్కడ జరిగేం లేదంటోంది బాధితురాలు.

హర్షసాయి దానధర్మాల వీడియోలు చూసి రాయలసీమ నుంచి కుటుంబంతో సహా వచ్చింది ఈ బాధితురాలు.. ఎనిమిది రోజుల పాటు వైజాగ్‌లోని ఆర్కే బిచ్‌లోనే ఎదురు చూసింది. ఓ పిలుపు రాకపోతుందా అని. కానీ తన బాధను కనీసం పట్టించుకోలేదని చెబుతోంది ఆమె.. కాకుపోతే పట్టించుకోవాలని రూలేం లేదు. కానీ తన దానాలతో వీపరితమైన క్రేజ్‌ సంపాదించి. దానికి సంబంధించిన వీడియోలను తెగ వైరల్‌ చేసుకొని ప్రజల్లో పాపులారిటీ సంపాదించారు హర్షసాయి. వీటిని చూసి.. చాలా మంది బాధితులు క్యూ కట్టారు. కానీ అందరికి సాయం చేయడానికి హర్షసాయి ఏమైనా సాయిబాబానా ..? కాదు కదా..  అయితే అయ్యింది.. లేదంటే లేదు అని చెప్పాలి కానీ.. ఈ తిప్పించుకోవడం ఏంటనేది బాధితులు చెబుతున్న మాట. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వీరంతా.. ఇప్పుడు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు.


ఇప్పుడు హర్షసాయి కేసు విషయానికి వద్దాం.. ఈ కేసు కూడా రోజుకో మలుపు తిరుగుతోంది అన్ని కేసుల్లాగానే.. మనం ముందే చెప్పుకున్నాం కదా.. ఆడియోలు వస్తాయి.. వీడియోలు వస్తాయి. కన్నీళ్లు కారుస్తారు.. సెంటిమెంట్ పండిస్తారు. ఎవరికి వారే మోసపోయామని చెబుతారు. బ్లేమ్ గేమ్‌ కంటిన్యూ చేస్తారు. ప్రెస్‌మీట్లు.. డిబేట్లు.. అబ్బో చాలా పెద్ద తంతు ఇది.

Also Read: ఊహించని ట్విస్ట్స్.. లాయర్లు చెప్పింది వింటే మైండ్ బ్లాక్..!

కానీ ఓ విషయం మాత్రం ఇక్కడ అర్థమౌతుంది. లైంగిక ఆరోపణల విషయం మాటేలా ఉన్నా. ఇద్దరి మధ్య పరిచయం ఉంది.. స్నేహం ఉంది.. అంతకుమించిన చనువూ ఉంది. ఇద్దరు కలిసి ఓ మూవీని ప్లాన్ చేశారు. గ్రాండ్ రిలీజ్‌కు కూడా రెడీ చేశారు. అయితే ఎప్పుడైతే డబ్బుల దగ్గర లెక్కలు తేడా కొట్టాయో. అక్కడి నుంచి మొదలైంది ఈ వివాదం. కాపీ రైట్స్ ఇవ్వను అన్నందుకు పిలిచి డ్రింక్స్‌లో సెడెటివ్స్ కలిపి వీడియోలు తీసి, రేప్ చేశాడన్నది బాధితురాలి మాట. లేదు లేదు.. అసలు హర్షసాయి పాపులారిటీని చూసి ఓర్వలేక అతడిని డీఫేమ్ చేయాలని కావాలనే ఫాల్స్ కేసు పెట్టారన్నది హర్షసాయి మాట.

ప్రస్తుతం హర్షసాయి వ్యవహారంపై రెండుగా విడిపోయారు. బాధితురాలికి మద్దతుగా కొందరు. హర్షసాయికి మద్ధతుగా మరికొందరు. సోషల్ మీడియాలో.. యూట్యూబ్‌ వీడియోస్‌లో కొట్టుకుచస్తున్నారు. కానీ అసలైన వారు మాత్రం నోరు మెదపడం లేదు. జరిగింది ఇదీ అని ఎవరూ నోరెత్తి చెప్పడం లేదు. బాధితురాలు మీడియా ముందుకు రావడం లేదు. ఇక హర్షసాయి అడ్రస్సే దొరకడం లేదు.. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన. ఈ గ్యాప్‌లో ఎవరికి నచ్చింది వారు చెప్పుకుంటున్నారు. ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు.

నిజానికి విషయం కేసుల వరకు వెళ్లిందంటేనే రాజీ కుదరలేదనే కదా.. ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడినా ఎవరు చెప్పేది వాళ్లే కరెక్ట్ అంటారు. లేదంటే నాలుగు గోడల మధ్య తేలాల్సిన విషయం నలుగురిలోకి రాదు కదా.. కాబట్టి.. కొన్ని రోజుల పాటు ఇది హాట్ న్యూస్‌గానే ఉంటుంది. ఆ తర్వాత అన్ని కేసుల్లాగే మెల్లిమెల్లిగా మరుగున పడిపోతుంది. ఇక్కడో విషయం చెప్పాలి.. వైజాగ్‌లో దిశ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవాడు హర్షసాయి. ఇప్పుడా హోదా లేదు.. పీకేశారు. హర్షతో ఉన్న ప్రమోషన్‌ను అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు హర్ష సాయి చేసిన ప్రమోషన్ యాడ్స్‌ను సైతం డిలీట్ చేశారు. కాబట్టి.. డౌన్‌ఫాల్ స్టార్టయ్యిందన్న మాట.

Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. Big Tv తో జానీ మాస్టర్ భార్య అయేషా..

Nag Ashwin : ‘కల్కి 2’ తర్వాత ఆ స్టార్ హీరోతో నాగీ సినిమా?

Young Heroine: ఒక్క అవకాశం కోసం 5 మంది.. భరించలేకపోయా..?

Namrata shirodkar: ఏంటీ.. మహేష్ కంటే ముందు నమ్రత ఇంకొకరిని ప్రేమించిందా.. అతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లాగవ్..!

Trisha : విజయ్ తో త్రిష ఎఫైర్ నిజమేనా?.. ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికేసిందే..

Emergency : ఆ సీన్లు కట్ చేస్తేనే ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికెట్… కంగనాకు ఎదురు దెబ్బ

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Big Stories

×