EPAPER
Kirrak Couples Episode 1

SIT Inquiry: తిరుమల లడ్డు వివాదం.. రంగంలోకి దిగిన సిట్ టీమ్, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో?

SIT Inquiry: తిరుమల లడ్డు వివాదం.. రంగంలోకి దిగిన సిట్ టీమ్, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో?

SIT Inquiry: తిరుమల లడ్డూ వివాదంపై రంగంలోకి దిగేసింది సిట్ టీమ్. సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు తమ పని మొదలుపెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు? టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు? ఆ కంపెనీల లావాదేవీలేంటి? దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు ఇలా రకరకాల విషయాలు వెలుగులోకి రానున్నాయి.


తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది… రేగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం పెద్దలు రంగంలోకి దిగేశారు. మరోవైపు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనని దుయ్యబట్టాయి. పరిస్థితి గమనించిన చంద్రబాబు సర్కార్ తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది.

గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సిట్ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. స‌భ్యులుగా విశాఖ‌ప‌ట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, క‌డ‌ప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, తిరుపతి అదనపు ఎస్పీ వెంకటరావు, డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, అన్నమయ్య జిల్లా ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వరి, చిత్తూరు జిల్లా సీఐ సూర్యనారాయణ ఇందులో సభ్యులు.


గురువారం డీజీపీ కార్యాలయంలో సిట్ టీమ్‌తో డీఐజీ ద్వారకా తిరుమలరావు సమావేశమయ్యారు. వారికి పలు సూచనలు చేశారు. తిరుమల లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠ నెలకొనడంతో దర్యాప్తు క్షుణ్ణంగా చేయాల్సిన విషయాన్ని నొక్కి వక్కానించారు. దీనికి సంబంధించి కొంత డీటేల్స్‌ను సిట్‌కు అందజేసినట్టు సమాచారం. దీంతో శుక్రవారం నుంచి సిట్ టీమ్ రంగంలోకి దిగేసింది.

ALSO READ: హైదరాబాద్‌లో చిక్కిన గనులశాఖ మాజీ డైరెక్టర్, సాయంత్రం కోర్టుకి వెంకటరెడ్డి…

ఇదిలావుండగా సిట్‌కు సహకారం అందించాలని టీటీడీ ఈవోను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ టీమ్ నేరుగా తిరుమల వెళ్లి టీటీడీ ఈవోను కలిసి  ఈ కేసుకు సంబంధించి డీటేల్స్ తీసుకోనుంది.

టీటీడీకి ఏఏ సంస్థలు నెయ్యి సప్లై చేశాయో తెలుకోనుంది. ఆ తర్వాత నెయ్యి తయారీ కంపెనీల డేటాను సేకరించనుంది. వాటికి అర్హత ఉందో లేదో తెలుకోనుంది. అర్హత లేని కంపెనీలు ఎన్ని ఉన్నాయి అనేదానిపై కూపీ లాగనుంది. నెయ్యిపై గతంలో, రీసెంట్‌గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది.

చివరకు టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు చేయనుంది సిట్. మాజీ ఈవో, మాజీ ఛైర్మన్లను సైతం విచారించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీలైతే వారిని అదుపులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని పరిశీలించనుంది. మరోవైపు లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుపతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది టీటీడీ. ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కిందట పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

TTD Ex EO Dharmareddy: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా

Ysrcp: తిరుపతి.. జగన్‌పై దాడికి కుట్ర! వైసీపీలో అంతా రివర్స్..

Venkatareddy arrest: హైదరాబాద్‌లో చిక్కిన గనులశాఖ మాజీ డైరెక్టర్, సాయంత్రం కోర్టుకి వెంకటరెడ్డి…

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

AP Custodial Torture Case: చిక్కుల్లో మరో ఏపీ ఐపీఎస్.. రేపో మపో ఆయనకు..

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Big Stories

×