EPAPER

Nitya Pooja: నిత్య పూజకు మినహాయింపులు ఉంటాయా..?

Nitya Pooja: నిత్య పూజకు మినహాయింపులు ఉంటాయా..?

Nitya Pooja:నిత్య పూజ అంటే రోజు చేయాల్సిన పూజ. మనం నిత్యం భోజనం చేయడం మానేయగలమా…? లేదు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు సంగతేంటన్న సందేహాలు వస్తుంటాయి. దీపారాధన, విగ్రహాలకు బొట్లు, ధూప దీప నైవేద్యం ఇవన్నీ కూడా దేవరాధన చేయడంలో మెట్లు మాత్రమే. నిత్య పూజలో అనుసరించాల్సిన పద్ధతులు మాత్రమే. శరీరం సహరించనప్పుడు రెండు చేతులూ జోడించి పూజ చేయడం నిత్య పూజ కిందే లెక్కే శాస్త్ర వచనం . స్నానం, దూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ ఉపచారముల అంటారు. రెండు జోతులు జోడించి ఇష్ట దైవాన్ని తలచుకోవడం ఏకోపచారం అంటారు. శరీరం సహకరించనప్పుడు దేవుడ్ని లఘువుగా జపిస్తూ ఒక విగ్రహాన్ని కడిగి బొట్టు పెట్టి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి దండం పెట్టుకోవచ్చు.


ఒంట్లో బాగోలేనప్పుడు ఎంత వీలైతే అంత సంక్షిప్తంగా పూజ చేయచ్చు. కానీ పూజ మానకూడదు అని చెబుతోంది శాస్త్రం. మనలో ప్రతి ఒక్కరూ ఈ 5 మంది దేవతలను నిత్యం పూజించాలి. ఇంకా అనేక విగ్రహాలు ఇంట్లో అవసరం లేదు.అలా అని ఉన్నవాటిని పారేయమని నా ఉద్దేశం కాదు. పూజా మందిరం లో తక్కువ విగ్రహాలు ఉంటే మందిరం శుభ్రంగా ఉండడమే కాకుండా పూజ కూడా ప్రశాంతంగా శ్రద్ధగా చేసుకోవడం జరుగుతుంది. ఒకే దేవుని విగ్రహం ఒకటే ఉంటే మంచిది. విగ్రహాలు ఎక్కువ ఉంటే ఇంటికి కీడు దోషము అనే మాటలు నమ్మకండి. భగవంతుడు మనకు మేలు చేసేవాడే కానీ కలలో కూడా కీడు చేయడు .

దేవుని పటాలు కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇష్ట దేవత కులదేవతల ఫోటోలు కచ్చితంగా ఉండాలి. 5 విగ్రహాలలో శివుడు మధ్యలో ఉండి చుట్టూ కింద చిత్రంలో ఉండేట్టు పెట్టుకోవడాన్ని శివ పంచాయతనం అంటారు. విష్ణువు మధ్యలో ఉంటే అది విష్ణు పంచాయతనం, అమ్మవారు మధ్యలో ఉంటే అది అంబికా పంచాయతనం, గణపతి మధ్యలో ఉంటే అది గణేష పంచాయతనం. పూజా మందిరం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు, చెత్త చెదారం అసలు ఉండకుండా చూసుకోవాలి.శ్రద్ధతో రోజు షోడశ ఉపచార పూజ చేయాలి. సమయం దొరకని వారు పంచోపచార పూజ చేయవచ్చు. భక్తి మాత్రమే ప్రధానం.


విష్ణువు అలంకార ప్రియుడు. అలాగే హనుమంతుడు కూడా అలంకార ప్రియుడే. శివుడిలా హనుమంతుడు అభిషేకప్రియుడు కూడా. వేదంలో మన్యుసూక్తమని ఒక సూక్తం ఉంది. అభిషేకం చేయటం వల్ల హనుమంతుడు పరమానందభరితుడవుతాడు.

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×