EPAPER
Kirrak Couples Episode 1

Vijaya Dairy: విజయ డెయిరీని గత ప్రభుత్వం ముంచిందా? డెయిరీ ఛైర్మన్ అమిత్ ఏమన్నారు?

Vijaya Dairy: విజయ డెయిరీని గత ప్రభుత్వం ముంచిందా? డెయిరీ ఛైర్మన్ అమిత్ ఏమన్నారు?

Vijaya Dairy: విజయ డైరీ నష్టాల వెనుక కారణం ఎవరు? గత ప్రభుత్వం డెయిరీని కావాలనే దెబ్బ తీసిందా? వ్యక్తిగత పాల వ్యాపారాలకు లబ్ది చేకూర్చేందుకు విజయ పాల డైరీని ముంచేశారా? ఏడాదిగా ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందా? అవుననే అంటున్నారు తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి.


విజయ పాట డెయిరీ నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు తెలంగాణ డైయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి. గత పాలకులే కారణంగా ఇలా జరిగిందని కుండ బద్దలు కుట్టేశారాయన. గత ప్రభుత్వం ఓ బడా నేత.. తన వ్యక్తిగత పాల వ్యాపారాలకు లబ్ది చేకూర్చుకునే క్రమంలో కొంత మేరా నష్టం చేకూర్చిన మాట వాస్తవమేనని మనసులోని మాట బయటపెట్టారు.

ALSO READ: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?


బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డెయిరీ కార్పొరేషన్ ఛైర్మన్ అమిత్‌రెడ్డి కీలక విషయాలు వివరించారు. విజయ డెయిరీలో గత పాలకుల జోక్యం విపరీతంగా పెరిగిందన్నారు. విజయ పాల డెయిరీకి కొన్ని సమస్యలు వున్నాయని వెల్లడించారు. మరో ఆరునెలల్లో విజయ మెగా డెయిరీని సాదారణ స్థాయికి తీసుకువస్తామని వివరించారాయన.

ప్రధాన రాజకీయ నేత ఒకరు డెయిరీలోకి అడుగుపెట్టడం మరో కారణంగా చెప్పుకొచ్చారు అమిత్‌రెడ్డి. దీని కారణంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ల్లో వాళ్ల ప్రొడక్ట్ సేల్ అయ్యిందని, దీని ప్రభావం విజయ డెయిరీపై చూపిందన్నారు. దీనిపై సమీక్ష జరిగిందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారాయన. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లో ఓసారి విందాం.

 

 

Related News

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, సీఎం సహాయనిధికి 20 కోట్లు..

Abids Taj Mahal Hotel: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

Bhatti Vikramarka: కొత్త లుక్‌లో భట్టి విక్రమార్క… ప్యాంట్, షూట్‌ వేసి అమెరికాలో హల్చల్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

CM Revanth: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్

KTR: బిగ్ షాక్.. చిక్కుల్లో మాజీ మంత్రి కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?

Big Stories

×