ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో జియోతో పాటు భారతీ ఎయిర్టెల్, వీ (వొడాఐడియా) టారిఫ్ ఛార్జీలను పెంచడంతో చాలా మంది ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన BSNL సహా ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అవుతున్నారు. దీంతో వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు వీలుగా తాజాగా కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను జియో తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే దిద్దిబాటు చర్యగా తమ కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా ఏకంగా 98 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అలాగే అన్లిమిటెడ్ 5Gని కూడా పొందవచ్చని తెలిపింది జియో. మరి ఈ ప్లాన్ ధర, వ్యాలిడిటీ, డేటా సహా ఇతర ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Jio RS 999 Recharge Plan – జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ధర రూ.999. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్, 4G డేటా, 5G డేటా సహా ఇతర ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. ఇంకా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతిరోజు 100 ఎస్ఎమ్ఎస్ లను వినియోగించుకోవచ్చు. ఒకవేళ 5G అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ 4Gడేటా స్పీడ్ తో ప్రతిరోజు 2GB డేటా పొందవచ్చు.
ఇంకా ఈ కొత్త జియో ప్లాన్ ద్వారా యూజర్స్ మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. జియో పాపులర్ యాప్స్ జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజ్ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా పొందేలా జియో సదుపాయాలను కల్పించింది.
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్. స్మార్ట్ ఫోన్స్‌లో జియో వెబ్సైట్ లేదా MyJio యాప్ ద్వారా ఈ కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ టెర్మ్ వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటా కావాలనుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్లాన్ బెస్ట్ ఆన్ లైన్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
దీంతో పాటు యూజర్స్ మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు సరికొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది. 84 రోజులు వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన జియో… ఈ ప్లాన్ ధర రూ.1,049, రూ. 1,299గా నిర్ణయించింది. ఈ కొత్త ప్లాన్ లో డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. అలాగే రూ.1,049 ప్లాన్‌లో అయితే సోనీ లివ్, జీ5 సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ.1,299 ప్లాన్‌లో అయితే నెట్ ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్ 480pలో పొందవచ్చు.
ALSO READ : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో జియో రూ.175 ఆఫర్ ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. 28 డేస్ వ్యాలిడిటీతో 10 GB డేటా పొందవ్చచు. ఇంకా పలు రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ను ఇది అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ 5, జియో సినిమా ప్రీమియమ్ ఉంటాయి. ప్రీమియమ్ కంటెంట్, షార్ట్ టెర్మ్ వ్యాలిడిటీ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.
వీటితో పాటు రూ.949, రూ.1029 ప్లాన్స్‌ను తీసుకొచ్చింది జియో. ఇందులో మొదటిది 90 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో రాగా, మరొకటిది 84 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇంకా వీటిలో అన్లిమిటెడ్ 5G డేటా, రోజువారీ 100 SMSలు, అన్లిమిటెడ్ కాలింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.