EPAPER
Kirrak Couples Episode 1

Savitri: సావిత్రికి అంత డిమాండ్ ఉండేదా.. జమున మాటల్లో విస్తుపోయే నిజాలు..!

Savitri: సావిత్రికి అంత డిమాండ్ ఉండేదా.. జమున మాటల్లో విస్తుపోయే నిజాలు..!

Savitri.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్లకు పర్ఫెక్ట్ జోడీగా నిలిచిన ఏకైక హీరోయిన్ సావిత్రి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన ఈమె మంచితనానికి మారుపేరు. అలాంటి సావిత్రి క్రేజ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


మహానటి గొప్పదనం ఎట్టిదంటే..
మహానటి సావిత్రి జీవితం ఒక తెరిచిన పుస్తకం అని అందరికీ తెలుసు..ఆమె సినిమా జీవితమే కాదు వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆమె బయోపిక్ వచ్చిన తర్వాత.. సావిత్రి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు నాటితరం, నేటితరం ఇలా అన్ని తరాలకి ఈమె ఒక ఆదర్శం అనే చెప్పాలి. తెలుగు వారు మాత్రమే కాకుండా తమిళనాట కూడా ప్రేమించి, ఆరాధించే హీరోయిన్ సావిత్రి. ఈమె వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. ముఖ్యంగా వైవాహిక జీవితం ఈమెను అతలాకుతలం చేసినా , సినిమా ఇండస్ట్రీ మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకుందని చెప్పవచ్చు.

విపత్తునిధి కోసం ఒంటిమీద నగలు ధారపోసిన సావిత్రి..


మహానటి సావిత్రి మంచి మనసున్న గొప్ప వ్యక్తి. ఎంతోమంది పాలిట దేవత. అయితే చివరి క్షణంలో మాత్రం ఎవరూ కూడా ఈమె పై కృతజ్ఞత చూపించలేకపోయారు. ఎంతో మందికి సహాయ సహకారాలు అందించిన సావిత్రి ని..వారంతా మోసం చేయడం ఇంతకంటే దారుణం మరొకటి లేదేమో. ఒకసారి 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న నగలు అన్నింటిని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రికి ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది. అయితే ఇదంతా విపత్తు నిధి కోసం ఈమె అందించిందని చెప్పవచ్చు.. తనతో పాటు తన కూతురు ఒంటిపై ఉన్న నగలు కూడా తీసి ఇచ్చారు సావిత్రి.

సావిత్రి వేసుకున్న మాల వేలం వేస్తే రూ.30 వేలు ధర..

ఇదిలా ఉండగా సావిత్రి కి అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో మరో హీరోయిన్ జమున గతంలో చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఒక సందర్భంలో ప్రభుత్వం విపత్తు నిధికి సినిమా వాళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు అప్పుడు పనిచేశారు. అయితే ఆ సమయంలో సినిమా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు . దీంతో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు సావిత్రి కోసం వేసిన పూలదండను వేలానికి పెడితే, అప్పట్లోనే రూ .30 వేలకు పైగా ధర పలికిందట. అయితే ఈ రూ.30 వేల విలువ అప్పట్లో రూ .30 లక్షలకు పైగానే అనుకోవచ్చేమో.. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కూడా. ఈమె క్రేజ్ అంతలా ఉండేది మరి.

30 ఏళ్ల కెరియర్ లో 252 చిత్రాలు..

అంతే కాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే విషయంలో కూడా వేలకు వేల రూపాయలు అలా తీసి ఇచ్చేసారట సావిత్రి. ఇకపోతే కెరీర్ లో 30 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈమె..ఏకంగా 252 చిత్రాలలో నటించింది. ఇలా ఎంతో ఉన్నతంగా బ్రతికిన సావిత్రి చివరి రోజులలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మత్తుకు బానిస అయ్యి, 1981 డిసెంబర్ 26న కోమాలోకి వెళ్లి కొన్నేళ్లు కోమలోనే ఉండిపోయిన సావిత్రి ఆ తర్వాత స్వర్గస్తురాలు అయింది.

Related News

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ?

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?

Devara Review : దేవర మూవీ రివ్యూ

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా

Big Stories

×