EPAPER
Kirrak Couples Episode 1

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ ఖాతాలో మరో రికార్డ్.. ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్!

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ ఖాతాలో మరో రికార్డ్.. ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్!

Kalki 2898 AD: టాలీవుడ్ అనేది ముందుగా తెలుగు ప్రేక్షకులకు పరిమితయ్యే సినిమాలు మాత్రమే తెరకెక్కించేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు చాలా మారిపోయాయి. తెలుగు నుండి ప్యాన్ ఇండియా రేంజ్‌కు, ఆ తర్వాత ప్యాన్ వరల్డ్ రేంజ్‌కు సినిమాలు వెళ్లాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘కల్కి 2898 AD’. ప్రభాస్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇదంతా ప్రభాస్ రేంజ్ వల్లే సాధ్యమయ్యిందని తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


మరో రికార్డ్

మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ కలెక్షన్స్ దాటి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 4వ ఇండియన్ మూవీగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. దీని ద్వారా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ అనే జోనర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. దీంతో ఈ జోనర్ కొత్తగా అనిపించడం, ఇందులో ప్రభాస్ కొత్తగా కనిపించడం, ఇందులో స్టార్ క్యాస్టింగ్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపి ‘కల్కి 2898 AD’ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. ఇప్పుడు ఈ మూవీ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకొని సత్తాచాటుకుంది.


Also Read: 

రెండు తేదీల్లో

త్వరలోనే బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కల్కి 2898 AD’ సినిమా ఫీచర్ కానుంది. అక్టోబర్ 2 నుండి 11 వరకు బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగనున్నాయి. అందులో అక్టోబర్ 8,9 తేదీల్లో ‘కల్కి 2898 AD’ స్క్రీనింగ్ జరగనుంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. విలన్‌గా కమల్ హాసన్ నటించాడు. ‘కల్కి 2898 AD’ కోసం అమితాబ్‌తో పాటు కమల్ హాసన్ కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ముఖ్యంగా కమల్ హాసన్ అయితే ఇంకాసేపు స్క్రీన్‌పై ఉంటే బాగుండేదని ప్రేక్షకులు ఫీలయ్యారు. అలా చాలావరకు పాజిటివ్ టాక్‌తో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా హిట్ అందుకుంది ‘కల్కి 2898 AD’.

సీక్వెల్ ప్లానింగ్

అయితే కల్కి కథతో ఒక సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేసినట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే రివీల్ చేశాడు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ‘కల్కి 2898 AD’కు సంబంధించిన సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభమయ్యింది. కానీ కొన్నేళ్ల వరకు ప్రభాస్ కాల్ షీట్స్ ఖాళీగా లేకపోవడంతో అసలు దీని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ప్రభాస్‌ను కర్ణుడి పాత్రలో చూపిస్తూ ‘కల్కి 2898 AD’ను ముగించాడు నాగ్ అశ్విన్. అందుకే అసలు దీని సీక్వెల్‌లో ఏముంటుంది అనే ఆసక్తి మూవీ లవర్స్‌లో ఉంది. 2027లో ఈ మూవీ సీక్వెల్ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.

Related News

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Kiraak RP: ఓయో లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆర్పీ భార్య.. కట్ చేస్తే.!

Devara Audience Reaction : తారక్ ఎర్ర సంద్రంపై తాండవం… ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

Harsha Sai: బయటకొస్తున్న హర్షసాయి దారుణాలు.. బాధితులు చెబుతున్నదాంట్లో నిజమెంత..?

Devara Movie: ‘దేవర’ సీక్వెల్ చూడడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..?

Prakash Raj: మనకు ఏం కావాలి? ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ – మోనార్క్ దాటికి పవన్ తట్టుకోగలరా?

Big Stories

×