EPAPER
Kirrak Couples Episode 1

Satyam Sundaram : కార్తీకి భారీ డిమాండ్… “సత్యం సుందరం”కు రెమ్యూనరేషన్ ఎంత అంటే?

Satyam Sundaram : కార్తీకి భారీ డిమాండ్… “సత్యం సుందరం”కు రెమ్యూనరేషన్ ఎంత అంటే?

Satyam Sundaram : తమిళ హీరో కార్తీ ఇటీవలే లడ్డూ కామెంట్స్ లో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సత్యం సుందరం అనే ఆయన లేటెస్ట్ మూవీ ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు అదే సినిమాకు కార్తీ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం బయటకు వచ్చింది. మరి సత్యం సుందరం మూవీకి కార్తీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం పదండి.


భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన కార్తీ 

96 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రేమ్‌ కుమార్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘మెయ్యజగన్’ అనే సినిమా తెరకెక్కింది. “మెయ్యజగన్” అనే టైటిల్ తో రూపొందిన ఈ తమిళ మూవీ తెలుగులో మాత్రం ‘సత్యం సుందరం’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కార్తీతో పాటు అరవింద్ సామి, రాజ్‌కిరణ్, శ్రీదివ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన మెయ్యజగన్ ట్రైల‌ర్ మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 27 న థియేటర్లలోకి ఈ సినిమా రానున్న నేపథ్యంలో ఈ మూవీకి కార్తీ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడైంది.


తమిళ సినీ ప్రముఖ నటుల్లో కార్తీ కూడా ఒకరు. 2007లో అమీర్‌ దర్శకత్వం వహించిన బరుత్తి వీరన్‌తో హీరోగా అరంగేట్రం చేసి ఎన్నో హిట్‌లు అందుకున్నాడు. కార్తీ నుంచి చివరిగా వచ్చిన జపాన్‌ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఆ ఆ వైఫల్యాన్ని మెయ్యజగన్ తో సరిదిద్దుకుంటాడని కార్తీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన మెయ్యళగన్ మూవీ కోసం కార్తీ దాదాపు 15-20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. జపాన్‌ ఫ్లాప్ అయినప్పటికీ కార్తీ తదుపరి చిత్రం సర్దార్ 2 లో నటిస్తున్నారు. పైగా ఖైదీ 2 కూడా లైన్ లో ఉంది. దీంతో జపాన్ మూవీతో బోల్తా పడ్డప్పటికి కార్తీకి ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే కార్తీ మెయ్యజగన్‌ మూవీ కోసం 20 కోట్లు పారితోషికం అనుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లడ్డూ వివాదంలో దిగొచ్చిన కార్తీ 

సత్యం సుందరం మూవీ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. అయితే అందులో భాగంగా యాంకర్ లడ్డూ కావాలా నాయనా అంటూ ఫన్నీగా అడిగింది. అయితే ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు. అది సెన్సిటివ్ టాపిక్ అంటూ విషయాన్ని దాటవేశాడు. అయినప్పటికీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్తీపై సీరియస్ అవ్వడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో కార్తీ వెంటనే దిగివచ్చి పవన్ కు సారీ చెప్పాడు. అలాగే ఆయన సోదరుడు, ఈ సినిమా నిర్మాత సూర్య కూడా తన తమ్ముడు చేసిన తప్పుకు తాను సారీ చెబుతున్నాను అంటూ పవన్ ను శాంతపరిచే ప్రయత్నం చేశారు. పవన్ కూడా విషయాన్ని ఇంకా పెద్దది చేయకుండా వాళ్ళ సారీని యాక్సెప్ట్ చేస్తూ మూవీ హిట్ కావాలని కోరుకున్నారు.

Related News

Bhale Unnade OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ?

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?

Devara Review : దేవర మూవీ రివ్యూ

TheyCallHimOG: ఓజీ రివ్యూ.. సుజీత్ సంభవం.. పవన్ కమ్ బ్యాక్ అదిరింది

Pushpa 2: పుష్ప 2 సెట్ లో బాహుబలి డైరెక్టర్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

NTR: పెద్ద ఎన్టీఆర్ డ్యాన్స్ ను దింపేశాడు మావా.. ఆయుధ పూజకు పూనకాలేరా

Big Stories

×