EPAPER
Kirrak Couples Episode 1

Kadium Srihari: కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి… స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా?

Kadium Srihari: కీలక వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి… స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా?

Station Ghanpur MLA Kadium Srihari Latest Comments: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైతే, ఆ ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోవని, ఒకవేళ ఉపఎన్నికలు వస్తే వాటిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని కడియం ఎద్దేవా చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, తన ముందు ఎగిరిన వాళ్లంతా కనుమరుగయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల కాలంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, 38 మందిని పార్టీలో చేర్చుకుని ఇప్పుడు సిగ్గులేకుండా కేటీఆర్ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పులను గౌరవిస్తానన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానంటూ కడియం వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పొలిటికల్ గా తీవ్ర దుమారం రేగుతుంది.


Also Read: తెలంగాణ సెక్రటేరియేట్ నిర్మాణం.. విజిలెన్స్ విచారణ, వామ్మో.. అన్ని కోట్ల అవినీతా?

వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారంటూ కడియం మండిపడ్డారు. ఈ విషయమై కేసీఆర్ ను నిలదీసినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయ్యిందంటూ ఆయన విమర్శించారు.


ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకంగా ఉన్న స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య గెలుపు ఖాయమంటూ కేటీఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా, 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను సాధించి అధికారం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. ఇదే సమయంలో ఇటు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. తన కూతురు, వరంగల్ ఎంపీ కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ కూడా కేటాయించి, అందుకు సంబంధించిన బీఫామ్ అందజేసింది. అనంతరం పోటీకి అంతా సిద్ధమైతున్న వేళ కావ్య బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది.

Also Read: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరితోపాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ పార్టీ గుర్తుతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతారంటూ వారిని బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఆ తరువాత హైకోర్టును ఆశ్రయించింది. వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తరువాత కోర్టు తీర్పు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ఎన్నికలు తప్పవా అంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది. కడియం వ్యాఖ్యలను చూస్తుంటే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పేలా లేవా ఏంటి? అంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

Related News

Reliance: రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, సీఎం సహాయనిధికి 20 కోట్లు..

Vijaya Dairy: విజయ డెయిరీని గత ప్రభుత్వం ముంచిందా? డెయిరీ ఛైర్మన్ అమిత్ ఏమన్నారు?

Abids Taj Mahal Hotel: ఆ హోటల్‌లో గలీజ్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. మీరు భోజనం చేశారా?

Bhatti Vikramarka: కొత్త లుక్‌లో భట్టి విక్రమార్క… ప్యాంట్, షూట్‌ వేసి అమెరికాలో హల్చల్

Building in Pond: ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్

CM Revanth: కాళేశ్వరం కట్టడం, కూలడం రెండూ జరిగాయి.. అధికారులకు ఇదే ఒక కేస్ స్టడీ: సీఎం రేవంత్

KTR: బిగ్ షాక్.. చిక్కుల్లో మాజీ మంత్రి కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?

Big Stories

×