EPAPER
Kirrak Couples Episode 1

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Potato Gaarelu: గారెల పేరు చెబితేనే నోరూరిపోవడం పోతుంది. గారెలు చేయాలంటే ముందుగానే మినపపప్పు నానబెట్టుకొని తర్వాత రుబ్బుకొని వేసుకోవాలి. ఇలా చేయడానికి అయిదు ఆరు గంటల సమయం పడుతుంది. ఇక్కడ మేము ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే బంగాళదుంప గారెల రెసిపీ ఇచ్చాము. కేవలం అరగంటలో వీటిని వండేసుకోవచ్చు. ఇవి రుచిలో అదిరిపోతాయి. క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి.


బంగాళదుంప గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

బంగాళదుంపలు – మూడు
కార్న్ ఫ్లోర్ – అరకప్పు
చిల్లీ ఫ్లేక్స్ – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్ ఫ్రై చేసేందుకు
చీజ్ తరుగు – పావు కప్పు


బంగాళదుంప గారెలు రెసిపీ

1. బంగాళదుంపలను మెత్తగా ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో ఆ బంగాళదుంపలను వేసి చేతితోనే మెత్తగా మెదుపుకోవాలి.
3. ఆ తర్వాత సన్నగా తరిగిన చీజ్‌ను కూడా అందులో వేసి కలుపుకోవాలి.
4. రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోండి.
5. చేతికి బాగా అంటుకుంటుంటే కాస్త నూనె చేతులకు రాసుకోండి.6. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి. బంగాళాదుంప మిశ్రమాన్ని చేతికి తీసుకొని గారెల్లా ఒత్తుకొని మధ్యలో రంధ్రం పెట్టి మరుగుతున్న నూనెలో వేయండి.
7. రెండువైపులా ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి.
8. అంతే టేస్టీ బంగాళదుంప గారెలు రెడీ అయినట్టే.
9. ఇవి చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.

Also Read: పొటాటో స్టఫ్డ్ ఎగ్ బోండా రెసిపీ, ఇంట్లోనే పిల్లల కోసం సింపుల్ స్నాక్

పిల్లలు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ ఇమ్మని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇలా బంగాళదుంప గారెలు చేసి పెట్టండి. ఇవి సాధారణ గారెలతో పోలిస్తే చాలా తక్కువ సమయంలోనే అయిపోతాయి. అలాగే క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. ఇవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా కచ్చితంగా నచ్చుతాయి. కెచప్ తో వీటిని తింటే రుచి అదిరిపోతుంది. స్పైసీగా కావాలనుకునేవారు తురిమిన పచ్చిమిర్చిని ఇందులో వేసి గారెలు వేసుకోండి. మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ ఉంటే ఆ స్పైసీనెస్ చాలా రుచిగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే బంగాళదుంప గారెలు చేసేందుకు ప్రిపేర్ చేసుకోండి.

Related News

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Camphor Benefits: కర్పూరం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

Big Stories

×