EPAPER
Kirrak Couples Episode 1

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Pink Pineapple: తరచూ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా పైనాపిల్ అంటే అనాస పండుతో అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే సాధారణంగా పైనాపిల్ పసుపు రంగులో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ పైనాపిల్ పింక్ రంగులో కూడా ఉంటుంది. గులాభీ రంగులో ఉండే పైనాపిల్ తో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.


పింక్ కలర్ లో ఉండే పైనాపిల్ లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది టమాటాలు, వాటర్ మిలన్లలోను ఉంటాయి. అయితే పైనాపిల్స్ లో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని ఎంజైమ్ల ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ఇది జన్యుపరంగా కూడా పింక్ కలర్లో ఉండడం వల్ల ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రత్యేకమైన పండు అని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తేల్చింది. అయితే అసలు ఈ పండుతో ఉండే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

పింక్ పైనాపిల్స్ రుచి ఎలా ఉంటుందంటే


గులాబీ రంగులో ఉండే పైనాపిల్స్ పసుపు రంగులో ఉండే పైనాపిల్ మాదిరిగానే రుచిగా ఉంటుంది. అంతేకాదు ఇది తియ్యగా కూడా ఉంటుంది. ఇందులో పులుపు తక్కువగా ఉంటుంది. దీనిని సుంగదాలలోను ఉపయోగిస్తుంటారు.

పింక్ పైనాపిల్స్ ఎక్కడ పండిస్తారు

గులాబీ రంగులో ఉండే ఈ పైనాపిల్ డెల్ మెంటే అనే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఇది దక్షిణ మధ్య కోస్టా రికాలో పొలంలో పండిస్తారు. ఇది అగ్నిపర్వతాల నేల, ఉష్ణమండల వాతావరణంలో పండిస్తారు. అయితే పింక్ పైనాపిల్, పసుపు పైనాపిల్ కంటే వేరుగా ఉంటుంది. ఇక గులాబీ రంగులో ఉండే పైనాపిల్ ను కాండం లేకుండా రవాణా చేస్తారు. ఈ పండుకు 2015 వ సంవత్సరంలో రోస్ పేరుతో దీనికి పేటెంట్ వచ్చింది.

పింక్ పైనాపిల్స్ ఎక్కడ దొరుకుతాయి

గులాబీ రంగులో ఉండే ఈ పైనాపిల్స్ కెనడా, అమెరికాలో విక్రయిస్తున్నారు. వీటిని ఆన్ లైన్ లోను కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే పింక్ పైనాపిల్ సర్టిఫికెట్, రెసిపీకి సంబంధించిన ఓ బుక్ లెట్ కూడా బాక్స్ లో వస్తుంది.

పింక్ పైనాపిల్స్ ధర ఎంతంటే ?

గులాబీ రంగులో ఉండే ఈ పైనాపిల్ పసుపు రంగులో ఉండే పైనాపిల్ కంటే ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది అన్ని చోట్లా అందుబాటులో ఉండదు.

అంత ఖరీదు ఎందుకంటే

గులాబీ రంగులో ఉండే పైనాపిల్ పండటానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. ఈ పండుకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఉన్న నిబంధనలు, నియమాల ప్రకారం ఈ మొక్కను పెంచుకోవడానికి అనుమతి లేదు.

పింక్ పైనాపిల్స్ ను రెండు లేదా మూడు రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటాయి. వీటిని వారం రోజుల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పింక్ పైనాపిల్ తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి చాలా రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Beauty Tips: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

Camphor Benefits: కర్పూరం గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

Big Stories

×