EPAPER
Kirrak Couples Episode 1

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

 


India vs Bangladesh 2nd Test Playing 11, Pitch report, live time, streaming: టీమిండియా రెండో టెస్ట్‌ కు రెడీ అవుతోంది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఇప్పుడు భారత జట్టు కాన్పూర్ లో రెండో మ్యాచ్ ఆడబోతోంది. కాన్పూర్ లో నల్ల మట్టి పిచ్ ను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నల్ల మట్టి పిచ్ పై స్పిన్నర్ల డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇద్దరు స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఉండడం జరుగుతోంది. మరో స్పిన్నర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీరిద్దరి మధ్య పోటీ మరి ఎక్కువగా కనిపిస్తోంది. బాల్ తో పాటు బ్యాట్ తోను రాణించాలంటే అక్షర్ పటేల్ కు ఎక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంది. కానీ గత కొంతకాలం నుంచి టెస్టుల్లో అక్షర్ పటేల్ పెద్దగా తన ఇంపాక్ట్ ను చూపించడం లేదనే వాధనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో జట్టులోకి కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.


Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

2021లో కాన్పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడింది. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీరు ముగ్గురు బరిలోకి దిగారు. అక్షర్ పటేల్ 6 వికెట్లతో తన సత్తాను చాటుకున్నాడు. కాన్పూర్ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే టీం మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది. ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని మాజీలు చెబుతున్నారు. తుది జట్టులో ఎవరు ఉన్నా ముగ్గురు స్పిన్నర్లు ఉండాల్సిందేనని అంటున్నారు.

Also Read:  IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

అయితే నల్ల మట్టి పిచ్ పై ఆడినట్లయితే బంగ్లాదేశ్ తో అలర్ట్ గా ఉండాలని సూచనలు చేస్తున్నారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించాము కదా అని రెండవ మ్యాచ్ ను చాలా లైట్ గా తీసుకోవద్దని అనుకుంటున్నారట. అందుకే రోహిత్‌ శర్మ కూడా చాలా ఫోకస్ చేస్తున్నారట. ముగ్గురు స్పిన్నర్ల లో ఎవరూ ఫైనల్‌ లిస్ట్‌ లో ఉంటారో చూడాలి.

 

భారత్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా/కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 : షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(w), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రాణా.

Related News

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం..ఇక ‘ఢిల్లీ’ నుంచి బరిలోకి !

Pakisthan: మా బౌలర్లు పందుల్లా తింటారు.. ఒళ్లంతా అందరికీ బలుపే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×