EPAPER
Kirrak Couples Episode 1

Meta AR Glasses: ఇక స్మార్ట్‌ఫోన్ అవసరం ఉండదు.. ప్రపంచంలోనే తొలి ఏఐ కంటి అద్దాలు వచ్చేశాయ్!

Meta AR Glasses: ఇక స్మార్ట్‌ఫోన్ అవసరం ఉండదు.. ప్రపంచంలోనే తొలి ఏఐ కంటి అద్దాలు వచ్చేశాయ్!

Meta AR Glasses| టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ యుగంలో ప్రముఖ టెక్ కంపెనీలన్నీ విన్నూత్న ఆవిష్కరణలు చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా మెటా కంపెనీ (ఫేస్ బుక్ మాతృక సంస్థ) ఓరియాన్ ఏఆర్ గ్లాసెస్ పేరుతో ఏఐ కంటి అద్దాలు ఆవిష్కరించింది. బుధవారం అమెరికాలో జరిగిన మెటా కనెక్ట్ 2024 కార్యక్రమంలో మెటా చీఫ్ జుకర్‌బర్గ్ ఈ హై టెక్నాలజీ గ్లాసెస్ ను ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రొటొటైప్ దశలో ఉన్న ఈ ఆగ్ మెంటెడ్ గ్లాసెస్ (ఏఆర్ గ్లాసెస్) త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.


ఈ గ్లాసెస్ ఉపయోగించే యూజర్ రియల్ వరల్డ్ తో పాటు వర్చువల్ వరల్డ్ లో కూడా ఒకేసారి పనిచేయొచ్చు. కటింగ్ ఎడ్జ్ సిలికాన్ కార్బైడ్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ ప్రత్యేక కంటి అద్దాలు యూజర్ కు హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఇస్తుంటాయి. జుకర్ బర్గ్ ఈ ఓరియాన్ ఏఆర్ గ్లాసెస్ ను లాంచ్ చేస్తూ.. ఈ స్పెషల్ అద్దాలు.. ఏఐ వాయిస్ అసిస్టెన్స్, హ్యాండ్ ట్రాకింగ్, ఐ ట్రాకింగ్, చేయి కదలికలు, మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఆదేశాలు స్వీకరించి యూజర్ కావాల్సిన అవుట్ పుట్‌ని ఇస్తుంది. పైగా ఈ గ్లాసెస్ ఉపయోగిస్తే.. ఇక స్మార్ట్ ఫోన్ అవసరం ఉండదు.

ఇక రకంగా చెప్పాలంటే ఇది ఫేస్ కంప్యూటర్ లాంటిది. వాస్తవిక ప్రపంచంలోని విజువల్స్ ని డిజిటల్ ఎలిమెంట్స్ తో మేళవిస్తుంది. దీని కంపాక్ట్ డిజైన్ యూజర్లకు ఆగ్ మెంటెడ్ రియాలిటీలో అతిపెద్ద వ్యూ ఇస్తుంది. ఈ అద్దాలు ఉపయోగించి యూజర్లు మస్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఒకవైపు సినిమాలు, సోషల్ మీడియా లేదా ఇతర ఎంటర్ టైన్మెంట్ చూస్తూనే మరో వైపు లైఫ్ సైజ్ హోలోగ్రామ్స్ ప్రొజెక్షన్ లలో పనిచేసుకోవచ్చు. ఈ గ్లాసెస్ చాలా తేలికగా ఉండడం వల్ల ఇండోర్, అవుట్ డోర్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. అవసరాన్ని బట్టి ఇవి ట్రాన్స్ పెరెంట్ గా మారిపోతాయి లేదా యూజర్ ముందు ప్రొజెక్షన్ చేసి స్క్రీన్ ని చూపిస్తాయి.


Also Read: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

ఇందులో మెటా ఏఐ ఫీచర్స్ ఇంటిగ్రేట్ చేయడంతో.. ఈ అద్దాలు యూజర్ ముందు ఉన్న వస్తువులను గమనించి.. యూజర్ ఆదేశాలను బట్టి కొత్త ఐడియాస్ ఇస్తుంది. లేదా వాటిని ఎలా ఉపయోగించాలో చూపిస్తుంది. ఉదాహరణకు యూజర్ ముందు ఒక ఫ్రిజ్ ఉంటే ఈ అద్దాలు పెట్టుకొని ఫ్రిజ్ ఓపెన్ చేసి.. అందులో ఉన్న కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో ఎటువంటి రెసిపీలు, వంటకాలు తయారు చేయొచ్చు చెప్పమంటే వెంటనే చెప్పేస్తుంది. ఆ వంటకాల వీడియోలు చూపిస్తూ.. ఎలా చేయాలో చూపిస్తుంది. పైగా పనిచేసుకుంటున్న సమయంలో చేతులు ఉపయోగించకుండా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్, మెసెంజర్ లాంటి యాప్స్ స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఆపరేట్ చేయవచ్చు.

ఈ ఓరియాన్ గ్లాసెస్ లో మూడు భాగాలుంటాయి. మొదటిది కంటి అద్దాలు, వైర్ లెస్ బ్యాటరీ ప్యాక్, దీన్ని ఆపరేట్ చేసేందుకు రిమోట్ లాంటి న్యూరల్ రిస్ట్‌బ్యాండ్. ఈ రిస్ట్ బ్యాండ్ ద్వారానే వీటిని కంట్రోల్ చేయాలి. ఈ స్పెష్టల్ ఓరియాన్ గ్లాసెస్ ప్రజలకు 2027లో అందుబాటులో వచ్చే అవకాశముందని మెటా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

మెటా కనెక్ట్ కార్యక్రమంలో జుకర్ బర్గ్ కంపెనీ కొత్త తీసుకురాబోయే క్వెస్ట్ 3ఎస్(Quest 3S) వర్చువల్ హెడ్ సెట్ ని కూడా చూపించారు. ఈ ఎంట్రీ లెవెల్ మిక్స్‌డ్ రియాల్టీ హెడ్ సెట్ అక్టోబర్ 15న లాంచ్ కానుంది.
దీని 128జిబి ధర 299.99 డాలర్లు కాగా, 256జిబి ధర 399.99 డాలర్లు. ఈ Quest 3S లో గ్రాఫిక్స్, స్లిమ్మర్ డిజైన్ ఉంటుంది. దీని పాత మోడల్స్ అయిన క్వెస్ట్ 2, క్వెస్ట్ ప్రో తయారీని కంపెనీ నిలిపి వేసింది.

Related News

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

Redmi Note 14 Pro Plus: రెడ్ మి నోట్ ప్రొ ప్లస్ వచ్చేస్తోంది బ్రో.. ఫీచర్స్ కిర్రాక్‌గా ఉన్నాయ్‌గా

Big Stories

×