EPAPER
Kirrak Couples Episode 1

R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

R Krishnaiah: బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్‌లోకి ఆర్. కృష్ణయ్య ?

హైదరాబాద్, స్వేచ్ఛ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడం, రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కించడం తన జీవిత లక్ష్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ తరలిరావాలని పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతానని, వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదించారు. ఈ నేపథ్యంలోనే విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.


Also Read: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు..

76 ఏళ్లుగా అన్యాయం:
బీసీ కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి వైఎస్ జగన్ అభిమానంతో తనకు రాజ్యసభ అవకాశం ఇచ్చారని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే తనకు ఆ అవకాశం ఇచ్చారని వివరించారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు అనుకున్న లక్ష్యం కోసం చేసే పోరాటంపై కొన్ని ఆంక్షలు, అవరోధాలు ఉంటాయని తెలిపారు. తాను రాజ్యసభలో బీసీ సంక్షేమానికి సంబంధించి ప్రశ్నలు వేస్తే సరైన స్పందన రాలేదని వివరించారు. తానెప్పుడూ బీసీల కోసమే ఉద్యమించానని, ఇకపైనా ఆ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. బీసీలకు ఇంకా సాంఘిక సమానత్వం రాలేదని, రాజకీయ అధికారం దక్కినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని వివరించారు. 76 సంవత్సరాలైనా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నదన్నారు. అందుకే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉండాలని తాను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇదే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం తాను ఉద్యమిస్తానని, దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ ఉద్యమం ఉంటుందని వివరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా ఈ ఉద్యమానికి కదలిరావాలని పిలుపు ఇచ్చారు. హర్యానా, రాజాస్తాన్‌లలో జాట్‌లు కొట్లాడినట్టు బీసీలు కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. తెలంగాణ ఉద్యమానికి కదలివచ్చినట్టు ప్రతి బీసీ బిడ్డా పోరాడాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారని, స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్లు పెంచాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రామ, మండల జిల్లా కమిటీలు వేయాలని సూచించారు.


Also Read: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

మల్లు రవి భేటీ
రాజ్యసభ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత విద్యానగర్‌లోని ఆయన నివాసానికి ఈ రోజు ఉదయం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెళ్లి కలిశారు. దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆర్ కృష్ణయ్యను ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం, ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఇంతలో అక్కడికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా వచ్చారు. బీసీలకు న్యాయం జరిగే పరిస్థితులు కాంగ్రెస్‌లో ఉన్నాయని, అందుకే ఆర్ కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ నాయకుల ఆహ్వానానికి ఆర్ కృష్ణయ్య సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. బీసీ సంక్షేమ సంఘం కమిటీ, తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తెలియజేస్తానని ఆయన చెప్పినట్టుగా సమాచారం. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నదని, సొంత పార్టీ పెట్టాలనే ఒత్తిళ్లు కూడా ఉన్నాయని ఆర్ కృష్ణయ్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

Related News

Telangan Police: మరీ ఇంత దారుణమా.. వైద్యశాలలో పేకాట… పట్టుబడిన మహిళలు

Indiramma Housing Scheme: శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు..

Etela Rajendhar: సర్పంచులు చనిపోతున్నా.. సర్కారు పట్టించుకోదా.. ?: ఈటల రాజేందర్

Kaleshwaram: కాళేశ్వరంపై విచారణ… ప్రశ్నలు దాటేసిన పద్మావతి.. జస్టిస్ అసహనం

Uttam Kumar Reddy: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్

BRS on Musi River: మూసీపై అప్పుడు కేసీఆర్ అలా.. ఇప్పుడు కేటీఆర్ ఇలా.. అడ్డంగా దొరికిపోయారుగా!

Big Stories

×