Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో మళ్లీ వేగం పుంజుకోవాలని చూస్తోంది. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ఏడాది అయ్యిపోయాక.. మళ్లీ హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మా ఇంటి బంగారం, విజయ్ చివరి సినిమాతో పాటు .. హిందీలో ఒక సినిమా ఒప్పుకుందని టాక్. ఇవి కాకుండా ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ అయిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
హాలీవుడ్ రూసో బ్రదర్స్ తెరకెక్కించిన సిటాడెల్ కు ఈ సిటాడెల్ రీమేక్ గా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా క్రియేట్ చేసింది. తాజాగా సిటాడెల్ హనీ బన్నీ స్పెషల్ స్క్రీనింగ్ ను లండన్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అతిరథ మహారథుల మధ్య సమంత హైలైట్ గా నిలిచింది.
ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ, అమెరికా కోడలు ప్రియాంక చోప్రా ఒకపక్క.. హాలీవుడ్ బ్యూటీ మటిల్డా డి ఏంజెలిస్ మరోపక్క మధ్యలో సమంత కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ముగ్గురు అందగత్తెలు ఒక ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలోనే సామ్ .. హాలీవుడ్ లో మెరిసినా ఆశ్చర్యం లేదు అనే చెప్పాలి. ఇకపోతే సిటాడెల్ ఒరిజినల్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆమె పాత్రనే సామ్ చేస్తోంది. అయితే ప్రియాంక చోప్రా సిటాడెల్ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.
యాక్షన్ పరంగా కానీ, కథ పరంగా కానీ.. రూసో బ్రదర్స్.. తెలుగువారిని మెప్పించలేకపోయారని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు సమంత ఉండడంతో ఈ సిరీస్ పై కొద్దోగొప్పో హైప్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే మేకింగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
ఇక ఈ సిరీస్ తరువాత ఫర్జీ తో ఇంకో యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్నే సంపాదించుకున్నారు. దీంతో ఈ సిరీస్ కోసం తెలుగువారు సైతం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా దాదాపు ఏడాది తరువాత సామ్ సిరీస్ లో కనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఈ సిరీస్ పై హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సిరీస్ తో సామ్ గట్టి కమ్ బ్యాక్ అందుకుంటుందో లేదో చూడాలి.