అల్పాహారంలో అరటిపండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ప్రతి రోజు ఉదయం అల్పాహారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

అరటి పండ్లలో డైటరీ ఫైబరీ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయపడుతుంది.

అరటి పండ్లలో పైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి ఆకలిని నియంత్రించి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అరటిపండ్లలో ఉండే ట్రెప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లలో పొటోషియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.

ప్రతిరోజు అల్పాహారంలో అరటిపండ్లను తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, కాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా చేస్తాయి.