స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQoo Z9 Turbo+ 5G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా లాంచ్ అయింది.

దీని బేస్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్ (సుమారు రూ. 27,300) నుండి ప్రారంభమవుతుంది.

అదే సమయంలో దాని 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2599 యువాన్ (సుమారు రూ.30,900)గా నిర్ణయించారు.

16జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2499 (సుమారు రూ.29,70) గా కంపెనీ నిర్ణయించింది.

ఇక దీని టాప్-ఆఫ్-ది-లైన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్ (సుమారు రూ. 34,500)గా కంపెనీ నిర్ణయించింది.

ఇది మిడ్‌నైట్ బ్లాక్, మూన్ షాడో టైటానియం, స్టార్‌లైట్ వైట్ వంటి కలర్ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది.

చైనాలోని Vivo ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ కొత్త iQoo ఫోన్ MediaTek Dimensityu 9300+ SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

ఇందులో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 CMOS ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.

ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6400mAh బ్యాటరీని అందించారు.