Viral News: ఇటీవల వాహనాలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కార్లు, ఆటోలకు సంబంధించిన వీడియోలు మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు, మరికొందరు తమ జీవితాన్నే వినూత్నంగా జీవించాలని మరికొందరు భావిస్తూ చేసే పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే బెంగుళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ టెక్నాలజీ వాడకంలో ఎంతో ఫాస్ట్ గా ఉన్నాడు. ప్రయాణికులు తమ పేమెంట్ చేసేందుకు స్కానర్ కాకుండా తన చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుని అందులో ఉండే క్యూ ఆర్ కోడ్ కి స్కాన్ చేసి పేమెంట్ చేయించుకుంటున్న వీడియో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఆటో డ్రైవర్ చేసిన ఓ వినూత్న పనికి సంబంధించిన వీడియో అందరినీ మళ్లీ ఆకట్టుకుంటుంది.
సాధారణంగా ఆటోలో ప్రయాణించడం అంటే ఎవరికి అయినా సాధారణమే. కానీ ఆటో డ్రైవర్ మాత్రం రాత్రి అనక, పగలు అనక ఎంతో కష్టపడి డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ తరుణంలో పొద్దంతా ఆటోలో కూర్చుని ఆటో నడపడం వల్ల నడుము నొప్పి, అలసట, మెడల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ తరుణంలో ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేవలం సాధారణంగా ఉండే ఆటో సీటు కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక సీటును ఏర్పాటు చేసుకున్నాడు. ఏకంగా ఆఫీసులో ఉండే కూర్చీ మాదిరిగానే ఓ చైర్ ఏర్పాటు చేసుకుని అందులో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే ప్రయాణికులు ఆటో డ్రైవర్ ఐడియా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తరుణంలో ఓ ప్రయాణికుడు దీనికి సంబంధించిన వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
auto driver’s seat had an office chair fixed for extra comfort, man i love bangalore @peakbengaluru 🤌🏼 pic.twitter.com/D1LjGZOuZl
— Shivani Matlapudi (@shivaniiiiiii_) September 23, 2024